YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

కరోనా ఎఫెక్ట్..ఢిల్లీ విమానాశ్రయంలో చిక్కుకున్న ప్రయాణికులు

కరోనా ఎఫెక్ట్..ఢిల్లీ విమానాశ్రయంలో చిక్కుకున్న ప్రయాణికులు

న్యూ ఢిల్లీ డిసెంబర్ 24 
బ్రిటన్ దేశంలో వెలుగుచూసిన కొత్త కరోనా వైరస్ జాతి ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలను రేకెత్తిస్తోంది.. భారత్తో సహా పలు దేశాలు యుకెకు విమాన సర్వీసులను రద్దు చేశాయి. ప్రయాణ ఆంక్షలు  ఎంతకాలం ఉంటాయనే దానిపై స్పష్టత లేదు. కరోనా తీవ్రతను బట్టే ఉంటుంది. చాలా మంది ప్రవాస భారతీయులు గత వారంలోనే భారతదేశానికి బ్రిటన్ నుంచి వచ్చారు. అయితే తాజాగా  గత రాత్రి నుండి ఢిల్లీ విమానాశ్రయంలో బ్రిటన్ వెళ్లే ప్రయాణికులు వందలమంది చిక్కుకున్నారు. వందలాది మంది బ్రిటన్ నుంచి ఇప్పటికే భారతదేశానికి వచ్చారు. వారిలో 25 మంది ఇప్పటివరకు కోవిడ్ -19 పాజిటివ్ గా పరీక్షించబడ్డారు. ప్రస్తుతం  కొత్త  వైరస్ ప్రబలడంతో  వచ్చే ప్రయాణికులందరికీ తప్పనిసరి పరీక్షలను చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్న ప్రయాణికులను కోవిడ్ -19 పరీక్షల కోసం ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోనే ఉంచారు. పరీక్షా ఫలితాలు వచ్చిన తర్వాత మాత్రమే వారిని బయటకు అనుమతిస్తారని తెలుపడంతో వందలమంది పడిగాపులు కాస్తున్నారు.
యుకె నుంచి 500 మందికి పైగా ప్రయాణికులు విమానాశ్రయంలో చిక్కుకున్నారు. వీరందరికీ లేట్ అయ్యే ఆర్టీ పిసిఆర్ పరీక్షలు చేస్తున్న కారణంగా నివేదికలు ఆలస్యం అవుతున్నాయని విమానాశ్రయ అధికారులు తెలిపారు.
డిసెంబర్ 22 నుండి 31 వరకు బ్రిటన్ నుంచి విమాన సేవలను భారతదేశం రద్దు చేసింది. ప్రయాణ నిషేధానికి ఒక రోజు ముందు ఢిల్లీ చేరుకున్న ప్రయాణీకులు.. విమాన సిబ్బంది అందరూ ఆర్టీ పిసిఆర్ తో  తప్పనిసరిగా పరీక్షలు చేసుకోవాలని నిర్బంధించారు.. భారతదేశంతో పాటు మరో 30 దేశాలు బ్రిటన్ నుంచి విమాన రాకపోకలను నిషేధించాయి.
ఢిల్లీలోని విమానాశ్రయంలో చాలా మంది ప్రయాణికులు ఇప్పుడు చిక్కుకుపోయారు. వారిలో చాలామంది తిండి నిద్ర లేక అలమటిస్తున్నారు. మరోవైపు సెప్టెంబరు నుండి యుకెలో  కొత్త  వైరస్ జాతి ప్రబలంగా ఉన్నందున కొత్త యుకె స్ట్రెయిన్ వైరస్ ఇప్పటికే దేశంలోకి వచ్చి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.

Related Posts