YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రాహుల్ గాంధీని కలిసిన టీపీసీసీ నేతలు

రాహుల్ గాంధీని కలిసిన  టీపీసీసీ నేతలు

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు   రాహుల్ గాందీని టీపీసీసీ నేతలు శుక్రవారం కలిసారు. ఇద్దరు ఎమ్మెల్యేలు  కోమటిరెడ్డి, సంపత్ ల ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు ఉదంతం , కోర్టు ఇచ్చిన తీర్పును వివరించారు. తరువాత వారు మీడియాతో మాట్లాడారు. టీపీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ హైకోర్టు తీర్పుతో రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు, కాంగ్రెస్ కృషిని రాహుల్ అభినందించారు.కోమటిరెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. ఏ స్థాయిలో అయిన పోరాటం ఉదృతం చేయాలని చెప్పారు. అసలు సభను అగౌర పరిచింది తెరాస. అడ్డగోలుగా సభను అగౌర పరిచి నడపాలనుకున్నారని ఆరోపించారు. సభలలో మెజారిటీ ఉందని ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం సరికాదు.  నియంతృత్వ ధోరణి పనికి రాదు.కేసీఆర్ , మధుసూదన చారి వారి పదవులకు రాజీనామా చేయాలని అన్నారు. రాహుల్ కూడా బస్ యాత్రలో రెండు రోజులు పాల్గొంటారని చెప్పారు. పార్టీలో ఎలాంటి విభేదాలు లేవు. అంతా మీడియా సృష్టి అని అయన అన్నారు. 

ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ రాహుల్ అన్ని తెలుసుకుని మా ఇద్దరిని అభినందించారు .రవిశంకర్ గారికి అభినందనలు చెప్పారు. పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలన్నారు. గ్రూపులకు అతీతంగా కేసీఆర్ ను ఓడించి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకోస్తాం. నెలన్నర నుంచి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు రాహుల్ తెలుసుకున్నారు. రాహుల్ పిలుపు మేరకు దిల్లీ వచ్చి వారిని కలిశామన్నారు. 45 నిమిషాల సుదీర్ఘ భేటీలో రాహుల్ ఇచ్చిన సందేశం మాలో ఉత్సహాన్ని పెంచింది. కోర్టు తీర్పు  స్ఫూర్తిగా అన్ని విషయాల్లో పోరాటం చేయండి మీ వెంట మేముంటాం అని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం పై పోరాటం కొనసాగిస్తూనే ఉంటామని అన్నారు. 

Related Posts