న్యూఢిల్లీ డిసెంబర్ 24
పరూ స్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇండియాతో చర్చలు సాధ్యం కావని అన్నారు పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ. అనధికారికంగాగానీ, దౌత్యపరమైన చర్చలుగానీ సాధ్యమయ్యే పరిస్థితులు లేవని ఆయన స్పష్టం చేశారు. ముల్తాన్‌లో బుధవారం మీడియాలో మాట్లాడిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు ద డాన్ పత్రిక వెల్లడించింది. ఇటు ఇండియా కూడా ఇదే అభిప్రాయంతో ఉంది. చర్చలు, ఉగ్రవాదం కలిసి వెళ్లలేవని చెబుతూ వస్తోంది. 2016లో పఠాన్‌కోట్‌లో దాడి తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు దిగజారిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పుల్వామా దాడి, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఇండియన్ ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్ తో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.