YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

మార్చి తర్వాత కేటీఆర్ సీఎం... ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు

మార్చి తర్వాత కేటీఆర్ సీఎం...  ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు

హైద్రాబాద్, డిసెంబర్ 24
 కేటీఆర్ సీఎం అవుతారన్న వార్త మరోసారి తెరపైకి వచ్చింది. మరో మూడు నెలల్లో కేటీఆర్ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రానున్న మార్చిలోపు కేటీఆర్‌ సీఎం అయ్యే అవకాశం ఉందని మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ ఎమ్మెల్యే డీఎస్‌.రెడ్యానాయక్‌ పేర్కొన్నారు. డోర్నకల్‌లో మున్సిపాలిటీకి 15వ ఆర్థిక సంఘం నిధులతో మంజూరైన రెండు ట్రాక్టర్లను బుధవారం ప్రారంభించిన అనంతరం మాట్లాడారు.ఈ మధ్య తాను మంత్రి కేటీఆర్‌ని కలిసానన్నారు ఎమ్మెల్యే. కురవి మండలం సీరోలు గ్రామాన్ని మండల కేంద్రం చేయాలని, నర్సింహులపేటలో పీహెచ్‌సీ నెలకొల్పాలని కేటీఆర్‌ని కోరినట్లు చెప్పారు. అలాగే డోర్నకల్‌కు ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ మంజూరు చేయాలంటూ విన్నవించిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా కాబోయే సీఎం కేటీఆర్‌ అంటూ రెడ్యానాయక్‌ వ్యాఖ్యానించారు. గత రెండేళ్లుగా తెలంగాణలో కేసీఆర్ తర్వాత సీఎం ఎవరు అవుతారన్న వార్తలు హాట్ టాపిక్‌‌గా ఉన్నాయి.తెలంగాణలో గత రెండేళ్లుగా చర్చకు దారితీసే అంశాలలో కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారన్న వార్త ఒకటి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత...కేటీఆర్‌నే కేసీఆర్ సీఎం చేస్తారని అంతా భావించారు. అయితే అనూహ్యంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించి.. కేసీఆరే సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. కేటీఆర్ సీఎం పీఠం ఎప్పుడు అవుతారు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు ఎప్పుడు విరమిస్తారు అన్న అంశంపై తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు టీఆర్ఎస్ పార్టీలో కూడా అంతర్గతంగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఎమ్మెల్యే రెడ్యా నాయక్ వ్యాఖ్యలతో మరోసారి సీఎం కేటీఆర్ అవుతారన్న వార్తలు ఆసక్తికరంగా మారుతున్నాయి.

Related Posts