ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి సింహాచలేశుని దర్శించుకున్నారు. ఉత్తర ముఖంగా భక్తులకు దర్శనమిస్తున్న అప్పన్నకు ప్రత్యేక పూజలు చేసారు. అధికారులు, పండితులు స్వామీజీకి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామీజీని వైకుంఠ ద్వారం నుంచి ఆలయంలోనికి తీసుకెళ్ళారు. ఈ సందర్బంగా స్వామి స్వరూపానందేంద్ర మీడియాతో మాట్లాడుతూ సింహాచలం దేవస్థానానికి రెగ్యులర్ ఈవోను నియమించాలన్నారు. రాష్ట్రంలో ఏ క్షేత్రానికీ లేనన్ని భూములు అప్పన్నకు ఉన్నాయని గుర్తుచేశారు. విలువైన భూములు అన్యాక్రాంతం కాకుండా ఉండాలంటే రెగ్యులర్ ఈవో పర్యవేక్షణ తప్పనిసరని అభిప్రాయపడ్డారు. ఐఏఎస్ అధికారుల కన్నా దైవ చింతన, ధార్మిక భావజాలం కలిగిన అధికారిని సింహాచలం దేవస్థానానికి తక్షణం నియమించాలని సూచించారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా అప్పన్నను ఇదే కోరుకున్నానని మీడియాకు చెప్పారు స్వామీజీ.