YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

జ్ఞానమార్గం

వైకుంఠ ఏకాదశి

వైకుంఠ  ఏకాదశి

వైకుంఠ  ఏకాదశి


మార్గశిర మాసం శుక్లపక్ష
ఏకాదశి రోజునే
' వైకుంఠ ఏకాదశి'  వ్రతం చేస్తారు.  
ఆనాడు వ్రతదీక్ష  పూనినవారు
ఉపవాసం ,జాగరణ చేసి స్వర్గద్వారం అని పిలవబడే
వైష్ణ్వాలయాలలోని  ఉత్తరద్వారం గుండా మహావిష్ణువు ని వైభవంగా
దర్శించే వారికి, పాపాలు
తొలగిపోయి సకల శుభాలు
కలుగుతాయని  పురాణ
గ్రంధాలు వివరిస్తున్నాయి.

????ఏకాదశి ఉసిరి కాయ:

ఏకాదశి నాడు  ఉసిరి ఆకు మరియు ఉసిరికాయ  వేసిన
నీటిలో స్నానం చేసి,  నియమంతో
మహావిష్ణువు ని
పూజించి, ద్వాదశినాడు
ఆహారంలో ఉసిరికాయను
చేర్చుకుని ఏకాదశి వ్రతాన్ని
సంపూర్ణం చేయడం ఉత్తమం. ఇందువలన
గంగాస్నానం చేసిన పుణ్యం,
కాశీలో నివసించిన పుణ్యం
లభిస్తాయని ఆధ్యాత్మిక
గ్రంధాలు తెలియచేస్తున్నాయి.

????స్వర్గద్వార(ఉత్తర ద్వార )
ప్రవేశం:

మహావిష్ణువు చే సంహరింపబడినందు
వలన మధు కైటభులనే  దానవులు
పరమపదవాసం పొందిన భాగ్యవంతులు.
ఈ దానవులు తమకి కలిగిన వైకుంఠ వాస భాగ్యం లోకంలోని భక్తులందరికి కలగాలని కోరుకున్నారు.

అందుకే , "వైకుంఠ ఏకాదశీనాడు  శ్రీ రంగంలోని ఉత్తర ద్వారం నుండి
ఉత్సవమూర్తిగా తమరు
వెలుపలికి వచ్చినప్పుడు
తమని దర్శించి మీ వెనుక వచ్చిన  భక్తులందరి పాపాలు తోలగించి ముక్తిని కలిగించాలని" మహావిష్ణువు ని  ప్రార్ధించారు.  నారాయణుడు ఆ విధంగానే
అనుగ్రహించాడు.
కలియుగంలో ని
భక్తులకి స్వర్గద్వార ప్రవేశం వలన ముక్తికి మార్గం లభించింది.

????వ్రత విధానం..
ఏకాదశి రోజు కి ముందు రోజైన దశమినాడు నారాయణుని పూజించి వ్రతం ఆరంభించాలి. ఆనాడు ఒంటిపూట ఉపవాసం చేయాలి. ఏకాదశినాడు తులసి దళాలు కోయరాదు.
ముందు రోజే కోసి పెట్టుకోవాలి
ఏకాదశినాడు ప్రాతఃకాలమున లేచి, నిత్యావసరాలు తీర్చుకుని మహావిష్ణువు ని పూజించాలి.
వైష్ణ్వాలయాలలో జరిగే
ప్రత్యేక పూజలను దర్శించడం ఆవశ్యకం.
ఆనాటి రాత్రి జాగరణ చేసి పురాణ గ్రంధాలు పఠిస్తూ హరినామ స్మరణతో గడపాలి.

ఏకాదశి నాటి మరుసటి రోజు ద్వాదశి . ఆనాడు
ఆహారం తీసుకోవడాన్ని
పారణ అంటారు.
ద్వాదశినాడు ఉదయం స్నానం చేసి, భగవంతుని ప్రార్ధించి , ఉప్పు పులుపులేని
ఆహారాన్ని ఉస్తి కాయలు , ఉసిరికాయ, అవిసాకు కూర
కలిపి  వండి దానిని పంటికి తగలకుండా , గోవిందా..గోవిందా..
గోవిందా
అని  ముమ్మారు ఉఛ్ఛరించి తినాలి.
ఈ విధంగా వ్రత  సమాప్తి చేయాలి.  ఆహారం తీసుకునే ముందే వయోవృధ్ధులకు భోజనం పెట్టాలి.
ద్వాదశినాడు పగటిపూట నిద్ర కూడదు.

????కృష్ణుడు చెప్పిన ఏకాదశి మహిమ:

పాండవదూతగా హస్తినాపురం వెళ్ళిన  కృష్ణుడు విదురునిఇంట
విడిది చేశాడు. అందుకు
దుర్యోధనాది కౌరవ సోదరులంతా  కృష్ణుని
పరిహాసం చేశారు.
వారితో
"నిత్యం  భగవంతుని
నామం స్మరిస్తూ, భగవత్ చింతనతో గడుపుతూ,
భగవంతుని మహిమలు ఉపదేశించే  భాగవతులు  తినగా మిగిలిన ఆహారం స్వీకరించడం
అత్యంత పవిత్రమైనది.
పాపాలని పోగొట్టే శక్తి కలది.శుధ్ధం భాగవతశ్యాన్నం".
అని కృష్ణుడు బదులు యిచ్చాడు.
ఇంకా కొన్ని  ఉన్నతమైన విషయాలు
కూడా చెప్పాడు.  
"శుధ్ధం భాగీరధీ జలం..శుధ్ధం విష్ణు
పద ధ్యానం  ..శుధ్ధం
ఏకాదశి వ్రతం."
అంటే , భగవంతుని చరణాల మీద పడిన ఒక నీటి బిందువు, గంగాదేవితో సమానమైన పవిత్రత కలది.
మహావిష్ణువు పాదాలని దర్శించడం , వైకుంఠాన్ని దర్శించడం కంటే పవిత్రమైనది. ఇన్ని  మంచి కార్యాలకు సమానమైనది
ఏకాదశి వ్రతం" అని ఉపదేశించాడు
శ్రీ కృష్ణుడు.

????తిరుమల తిరుపతిలో
వైకుంఠ ఏకాదశి..
తిరుమల తిరుపతిలో స్వర్గద్వార ప్రవేశ ఆచారం  (ఉత్తర ద్వారం) లేదు. అందుకు బదులుగా వైకుంఠ
ఏకాదశికి '.ముక్కోటి ప్రదక్షిణం' అనబడే ప్రాకారంలో
యీ ప్రత్యేక ఉత్సవం జరుగుతుంది. తిరుపతిలో
యీ ముక్కోటి ప్రదక్షిణం
స్వర్గద్వార ప్రవేశానికి సమానమని ఆంటారు.
తిరుమల తిరుపతిలో
సంపంగి ప్రాకారం (మొదటి ప్రాకారం) మరియు విమాన
ప్రదక్షిణం (.2వ ప్రాకారం)
అవి కాకుండా  ' ముక్కోటి ప్రదక్షిణం ' అనే ప్రాకారం వున్నది. ఈ ప్రాకారం సంవత్సరానికి మూడురోజులు మాత్రమే తెరుస్తారు. అంటే మార్గశిరమాస వైకుంఠ
ఏకాదశికి ముందురోజు
దశమినాటి నుండి  ద్వాదశిదాకా తెరచి వుంటుంది.

వైకుంఠ ఏకాదశి అనగానే
పరమపద స్వర్గద్వారం
అందరికి గుర్తుకి వస్తుంది.
ఆనాడు స్వర్గద్వారం వద్ద
దర్శనమనుగ్రహించే
నారాయణుడు పరమపదనాధుడిగా
అందరినీ అనుగ్రహిస్తున్నాడు.????

Related Posts