సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం పులివెందులలోని సీఎస్ఐ చర్చికి చేరుకొని తల్లి వైఎస్ విజయమ్మ, భార్య వై ఎస్ భారతి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థన కూటమిలో పాల్గొన్నారు. పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో ముఖ్యమంత్రితో పాటు డిప్యూటి సీఎం ఎస్.బి.అంజద్ భాష, జిల్లా ఇన్చార్జి మంత్రి, ఆదిమూలపు సురేష్, ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సి హరికిరణ్, జేసిలు ఎం. గౌతమి, పి.ధర్మచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆకెపాటి అమరనాధ్ రెడ్డి, మాజీ మేయర్ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఎస్పి అన్బురాజన్ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ క్రిస్మస్ తో పాటు వైకుంఠ ఏకాదశి కలిసి రావడం శుభదినం. ఇవాళ 30లక్షలకు పైగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నాం. పులివెందులలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వలేకపోవడం బాధాకరమని అన్నారు. కోర్టు స్టే ఇచ్చినా సుప్రీంకోర్టుకు వెళ్లి పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామని అయన వ్యాఖ్యానించారు.