ముక్కోటి దేవతలు శ్రీమన్నారాయణుడిని కనులారా దర్శించుకునే రోజు వైకుంఠ ఏకాదశి. ఈ ఏకాదశి వైష్ణవ భక్తులకు పవిత్రమైనది. తిరుమల సహా అన్ని వైష్ణవ ఆలయాల్లో ఉత్తరం వైపు ఉండే ద్వారాన్ని తెరుస్తారు. వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం గుండా స్వామి వారిని దర్శించుకుంటే సకల పాప నివారిణితోపాటు వైకుంఠ ప్రవేశం చేసినంత పుణ్యం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. అలాగే ఏకాదశి నాడు వ్రతం ఆచరించడం వల్ల శ్రీమన్నారాయణుడిని దర్శించుకునే భాగ్యం క లుగుతుందని భక్తుల నమ్మకం. ఈ వ్రతానికి ఎం తో పురాణ ప్రాశస్తి ఉన్నది. పురాణాల ప్రకారం.. కృత యుగంలో చంద్రావతి నగరాన్ని రాజధానిగా చేసుకుని మురాసురుడనే రాక్షసుడు పాలించేవాడు. బ్రహ్మదేవుడి వ రంతో మురాసురుడు మహర్షుల యజ్ఞాలను ధ్వంసం చేసేవాడు. చివరికి దేవతలను కూడా వ దిలి పెట్టకుండా వేదించేవాడు. దీంతో దేవతలం తా కలసి విష్ణువుతో కాపాడాలని మొరపెట్టుకున్నారు. మహావిష్ణువు మురాసురుడిపై యుద్ధాని కి బయలుదేరుతాడు. కానీ మురాసురుడిని సం హరించడం విష్ణువు వల్ల సాధ్యం కాలేదు. అలసిపోయిన ఆయన బదరికా ఆశ్రమంలో విశ్రాంతి తీసుకునేందుకు ఉపక్రమించాడు. ఆ సమయం లో స్వామి శరీరంలో నుంచి ఏకాదశి కన్య ఉద్భవించి మురాసురుడితో యుద్ధం చేసి వధిస్తుంది. కన్య ధైర్యాన్ని మెచ్చుకున్న స్వామి ఏమి వరం కావాలో కోరుకోమన్నాడు. దీంతో కన్య తన పే రుమీద ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఏకాదశి రోజున వ్రతం ఆచరించి శ్రీమన్నారాయణుడిని కొలుస్తా రో వారికి మోక్షం కలిగించి వైకుంఠ ప్రాప్తి కలింగించమని వేడుకుంటుంది. అందుకే భక్తులు ఏ కాదశి రోజున ఉపవాసంతో స్వామి వారి వ్రతా న్ని ఆచరించడం ఆనవాయితీ.ఉత్తర ద్వారమనగానే దైవాన్ని ఉత్తర దిక్కుగా కూర్చుండబెట్టి దర్శనం కలిగించడమని భావిస్తా రు. కానీ అది నిజమైన దర్శనం కాదంటారు పం డితులు. ఉత్తరాయణంలో శరీరంలో ఏ బ్రహ్మ రంధ్రం అయితే ఉందో (మాడు).., ఆ మధ్య భాగంలో పరమేశ్వరుడు ఉం టాడని, పరమేశ్వరుడి దర్శనం బ్ర హ్మ రంధ్ర స్థానంలో ఉండే ఉత్తర ద్వా ర దర్శనమని పండితులు చెబుతున్నా రు. బ్రహ్మ రంధ్రం రెండు తలుపులతో ఇమిడి ఉంటుందని, వీటిని తెరిస్తే యోగి పుంగవులకు భగవంతుడి దర్శనమవుతుందని, అది కేవలం ఈ మార్గశి ర మాసంలోనే వస్తుందంటున్నారు. దీనినే ఉత్తర ద్వార దర్శనమని అంటారు. ధనుర్మాసంలో స్వామివారిని ఉత్తర ద్వారముఖంగా చూడాలని పెద్దలు చెప్తారు.