YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం తెలంగాణ

పారిశుధ్య సిబ్బంది ఎంపిక పారధర్శకంగా చేయాలి - హరితహారం నిధుల దుర్వనియోగం పై విచారణ జరపాలి - మున్సిపల్ డైరెక్టర్ కు కాంగ్రెస్ కౌన్సిలర్ల ఫిర్యాదు

పారిశుధ్య సిబ్బంది ఎంపిక పారధర్శకంగా చేయాలి - హరితహారం నిధుల దుర్వనియోగం పై విచారణ జరపాలి - మున్సిపల్ డైరెక్టర్ కు  కాంగ్రెస్ కౌన్సిలర్ల  ఫిర్యాదు

జగిత్యాల మున్సిపల్ లో 30మంది అదనపు పారిశుద్ధ్య సిబ్బంది ఎంపిక పారదర్శకంగా చేసేలా చూడాలని మున్సిపల్ డైరెక్టర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారికి మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ కళ్లేపల్లి దుర్గయ్య తో పాటు ఐదుగురు కాంగ్రెస్  కౌన్సిలర్లు శుక్రవారం  ఫిర్యాదు చేశారు.


జగిత్యాల మున్సిపల్లోపక్క గ్రామాలు  విలీనం కావడం, పట్టణ  పరిధి పెరుగడంతో పారిశుద్ధ్య కార్మికులు సరిపోవడంలేదని మీ దృష్టికి తీసుకువచ్చామని దాంతో   30మంది  పారిశుద్ధ్య కార్మికులను ఔట్ సోర్సింగ్ విధానం ద్వారా ఎంగేజ్చేసుకొనుటకు అనుమతి ఇచ్చారని తెలిపారు.  దాంతో  మున్సిపల్ సమావేశం ఎజెండాలో పొందుపరిచగా సభ్యులo ఆమోదం   తెలిపామని  పిర్యాదులో  పేర్కొన్నారు. పారిశుధ్య సిబ్బందిని టిఎల్ ఎఫ్ కార్యవర్గనికి   కార్మికుల నియామకానికి ఎలాంటి సంభందం లేదని, అంతేగాకుండా వారికీ నియమించే విషయం కూడ తెలువదని కౌన్సిలర్లు పేర్కొన్నారు. మున్సిపల్ పాలకవర్గం, అధికారులు, శానిటరీ ఇన్స్పెక్టర్ మీరు ఇచ్చిన నిబంధనలను పక్కనపెట్టి అట్టి ఉద్యోగాలను అమ్ముకునే ప్రయత్నాలు చేస్తున్నారని, ఆమోదం రాకముందే చాలా మంది కార్మికుల వద్ద బేరాలు కుదుర్చుకున్నారని తెలిపారు. గత 3నెలల క్రితం కొంతమందిని తీసివేసి వారి స్థానంలో ఇతరులను పెట్టుకున్న విషయం మీ దృష్టికి తీసుకురావడo జరిగిందని అటువంటి అవకాశం ఇవ్వకుండా మీరు ప్రత్యేక ధృష్టి పెట్టాలని  కౌన్సిలర్లు కోరారు. కార్మికులను ఎంగేజ్ చేసుకునే విధానంలో మొదటగా పేపర్ప్రకటన ఇచ్చి   పేదలు బడుగు, బలహీన వర్గాలకు చెందిఉండి శానిటేషన్ పనిచేసే వారికే అవకాశం కల్పించాలని వారు సూచించారు. దరఖాస్తులు చేసుకున్న పిదప సిబ్బంది ఎంపిక పారదర్శకంగా ఉండాలంటే కలెక్టర్  ఆధ్వర్యంలో డ్రా తీసి ఎంపిక చేయాలని, అలాగే జీతాలు టిఎల్ఎఫ్ కు కాకుండా కార్మికులకె  బాధ్యతలు అప్పగించాలని డైరెక్టర్ ను  కోరారు.


హరితహారం లో భాగంగా ఏర్పాటు చేసిన నర్సరీల మెంటనేన్స్, మొక్కల సంరక్షణ నిమిత్తం 20 మంది కార్మికులు 3నెలల కొరకు ఎంగేజ్ చేయడానికి రూ. 8.10లక్షలు కౌన్సిల్ ఆమోదం పొంది అట్టి పనిలో మున్సిపల్ పారిశుధ్యకార్మికులనే  వాడుకున్నారని, అక్కడ సైతం ఇలాంటి పని చేయలేదని, దాంతో ప్రభుత్వం ఇచ్చిన  గ్రీన్ బడ్జెట్ దుర్వినియోగం అయిందని దీనిపై విచారణ జరిపి ప్రజా ధనాన్ని కాపాడాలని వారు కోరారు. పిర్యాదు చేసిన వారిలో కౌన్సిలర్లు  నక్క జీవన్, ఆసియా సుల్తాన, సాహెరా భాను, ఫర్విను సుల్తాన, ములస్తం లలిత లు పిర్యాదు చేశారు.

Related Posts