ఈ నెల 15వ తేదీ గూడూరు మండలం పురిటి పాలెం లో జరిగిన సాయి కుమార్ హత్య కేసులో ఇద్దరు ముద్దాయిలను అరెస్టు చేశామని గూడూరు డిఎస్పి రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు.
రూరల్ పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశంలో ముద్దాయిలను ప్రవేశపెట్టారు.
నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో డిఎస్పి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఈనెల 15వ తేదీ పురిటి పాలెం గ్రామంలో మృతుడు
సాయికుమార్ అతని స్నేహితులు చెన్నూరు శ్రీనాథ్, చెన్నూరు శేఖర్ మద్యం తాగుతూ మాటా మాటా పెరిగి ఘర్షణ పడ్డారని, దీంతో ముద్దాయిలు శ్రీనాథ్, శేఖర్ కత్తితో సాయి కుమార్ను
గాయపరిచి పారిపోయారని అన్నారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ సాయి కుమార్ ఈ నెల 18వ తేదీ మృతిచెందాడు. అప్పటినుండి ముద్దాయిల కొరకు నిఘా ఉంచామని సాయంత్రం
పోటు పాలెం సర్కిల్ వద్ద నిందితులను అరెస్టు చేసి వారు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నామని, నిందితుడిని కోర్టులో హాజరు పరుస్తూన్నామని తెలిపారు. కేవలం మద్యం
మత్తులో జరిగిన చిన్న ఘర్షణ మనిషి హత్యకు దారి తీసిందని అందువల్ల మధ్యం అలవాటును మానుకోవాలి అని సూచించారు ఈ సమావేశంలో రూరల్ సిఐ శ్రీనివాస్ రెడ్డి ,ఎస్సై
పుల్లారావు, సిబ్బంది పాల్గొన్నారు.