YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పేదలందరికి ఇళ్లు

పేదలందరికి ఇళ్లు

పేదవాళ్లకు ఇళ్ల పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. రాష్ట్రవ్యాప్తంగా 15 రోజుల పాటు ఇళ్ల పండుగ జరగబోతోందని  సగర్వంగా చెబుతున్నానని.. వైకుంఠ

ఏకాదశి రోజు ఈ కార్యక్రమం చేపట్టం శుభపరిణామం అన్నారు. ఇంతకంటే దేవుడు తనకు ఇవ్వదగిన వరం ఏముందని భావోద్వేగంతో చెప్పారు. అక్క  చెల్లెళ్ల మొహంలో ఆనందం

చూస్తున్నామని.. ఇళ్లు కాదు.. గ్రామాలకు గ్రామాలు నిర్మాణం కానున్నాయి అన్నారు. పాదయాత్రలో పేదవారి కష్టాలు చూసి పేదవారి పరిస్థితులు మారిపోవాలని సంకల్పంతో ఎన్నికల

మేనిఫెస్టోలో పేదవాళ్లకు ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చామన్నారు.కులాలు, మతాలు, పార్టీలు చూడకుండా అర్హత చూసి ఇళ్లు ఇస్తామని చెప్పామని ఇప్పుడు నెరవేర్చామన్నారు.

అర్హత మాత్రమే చూడాలని చెప్పాం.. ఓటు వేయని వారికి కూడా ఇవ్వాలని చెప్పాం.. ఓ బాధ్యతగా పక్కా ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పి.. ఆ హామీని నెరవేరుస్తున్నామని గర్వంగా

చెబుతున్నాను అన్నారు. గత ప్రభుత్వం చివరి రెండేళ్లలో మొక్కుబడిగా అక్కడక్కడా ఇళ్లు కట్టారని.. తాము మాత్రం వచ్చే మూడేళ్లలో కట్టబోతున్నవి ఊళ్లకు, ఊళ్లు అన్నారు. ఇప్పుడు

31 లక్షల కుటుంబానికి ఇళ్లు కట్టించి ఇవ్వబోతున్నామని.. కోటి 24లక్షలమందికి మేలు జరగబోతోందన్నారు జగన్.స్థలం మాత్రమే కాదు ఇల్లు కట్టే బాధ్యత కూడా తీసుకున్నామని..ఈ

ఇళ్లలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామన్నారు ముఖ్యమంత్రి. ఇంటి స్థలం ఇవ్వడం మాత్రమే కాదు.. మూడు ఆప్షన్‌లు ఇస్తున్నామన్నారు. మొదటి ఆప్షన్ ప్రకారం.. ప్రభుత్వం ఇచ్చిన

నమూనా ప్రకారం ఇళ్లు నిర్మించుకోవడానికి అవసరమైన, నాణ్యమైన నిర్మాణ సామాగ్రిని ప్రభుత్వం సరఫరా చేస్తుందని.. లేబర్ ఛార్జీలు ఇస్తుంది.. మీరు దగ్గరుండి ఇళ్లు కట్టించుకోవచ్చు

అన్నారు. రెండో ఆప్షన్‌లో ఇంటి నిర్మాణానికి అసవరమైన సామాగ్రి కొనుగోలు చేసుకోవచ్చని.. ఆ డబ్బుల్ని ప్రభుత్వమే దశలవారీగా ఇస్తుమన్నారు. మూడో ఆప్షన్‌లో భాగంగా.. ఇంటి

నిర్మాణ బాధ్యత వద్దనుకుంటే ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇస్తుందని.. నాణ్యమైన సామాగ్రితో ఇల్లు నిర్మాణం చేస్తామన్నారు. ఏ ఆప్షన్ అయినా తీసుకోవచ్చని అవకాశం కల్పించారు.
ఇళ్లు

కట్టుకున్న ఐదేళ్ల తర్వాత అక్క చెల్లెమ్మలు అమ్ముకోవాలన్నా, బ్యాంకులో పెట్టి లోన్లు తెచ్చుకునేలా చేద్దామనుకున్నామని.. కానీ సాధ్యపడలేదన్నారు సీఎం. కానీ కొంతమంది కుట్రలు

చేస్తున్నారని.. ప్రస్తుతానికి పట్టాలు ఇస్తున్నాం.. న్యాయపరమైన చిక్కులు తొలిగిన వెంటనే అక్క చెల్లెమ్మల పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తామన్నారు. కొందరు కుట్రలతో అక్క చెల్లెమ్మలకు ఇళ్లు

కట్టకుండా అడ్డుకుంటున్నారని.. కోర్టుల్లో పిటిషన్లు వేశారన్నారు. అమరావతి ప్రాంతంలో పేదల కోసం ఇళ్ల పంపిణీని అడ్డుకున్నారని.. త్వరలోనే సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని..

అర్హులైన అందరికి ఇళ్ల పట్టాలు అందజేస్తామన్నారు. అలాగే వచ్చే రెండున్నరేళ్లలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. అలాగే ఎవరైనా అర్హత ఉండి ఇళ్ల పట్టా రాకపోతే వారు మరోసారి

దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామని సీఎం అన్నారు.

Related Posts