YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆటలు

సెకండ్ టెస్ట్ కు భారత్ రెడీ

సెకండ్ టెస్ట్ కు భారత్ రెడీ

ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్ వేదికగా శనివారం నుంచి ప్రారంభంకానున్న రెండో టెస్టుకి తుది జట్టుని శుక్రవారం భారత్ ప్రకటించింది. నాలుగు మార్పులతో

కూడిన ఈ  జట్టులోకి ఓపెనర్ శుభమన్ గిల్, ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఎంట్రీ ఇవ్వగా.. వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కి ఎట్టకేలకి మళ్లీ ఛాన్స్ లభించింది. ఇక గాయం నుంచి కోలుకుని

పూర్తిగా ఫిట్‌నెస్ సాధించిన రవీంద్ర జడేజా కూడా టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు. అడిలైడ్ వేదికగా ఇటీవల ముగిసిన తొలి టెస్టులో భారత్ 8 వికెట్ల తేడాతో అవమానకరీతిలో

ఓడిపోయిన విషయం తెలిసిందే.మెల్‌బోర్న్ (బాక్సింగ్ డే ) టెస్టుకి భారత్ జట్టు ఇదే: మయాంక్ అగర్వాల్, శుభమన్ గిల్, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానె (కెప్టెన్), హనుమ విహారి,

రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్అడిలైడ్ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 0, 4 పరుగులతో

నిరాశపరిచిన ఓపెనర్ పృథ్వీ షాపై వేటు పడగా.. అతని స్థానంలో శుభమన్ గిల్ ఓపెనర్‌గా టీమ్‌లోకి వచ్చాడు. ఇక పితృత్వ సెలవులు తీసుకుని కెప్టెన్ విరాట్ కోహ్లీ భారత్‌కి వచ్చేయగా..

మోచేతి గాయంతో అతని వెంట ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ కూడా వచ్చేశాడు. దాంతో.. కోహ్లీ స్థానంలో రవీంద్ర జడేజా, షమీ స్థానంలో మహ్మద్ సిరాజ్ జట్టులోకి వచ్చారు. ఇక వికెట్ కీపర్

సాహా.. తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌లో 9, 4 పరుగులే చేయడంతో అతడిపైనా వేటు పడింది. దాంతో.. రిషబ్ పంత్‌కి చోటు దక్కింది. అయితే.. కేఎల్ రాహుల్‌ని తుది జట్టులోకి

తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.

Related Posts