YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వివేక కేసు తేలేదెప్పుడు

వివేక కేసు తేలేదెప్పుడు

కడప, డిసెంబర్  26, 
జగన్ ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా ఆ ఒక్క ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ విషయం ప్రజల్లో జగన్ ను అనుమానించేలా చేస్తుంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో దీనికి జగన్ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైఎస్ వివేకానందరెడ్డి గత ఏడాది మార్చి నెలలో హత్యకు గురయ్యారు. ఆయన శరీరంపై ఏడు కత్తిపోట్లు ఉండటంతో దారుణ హత్య అని చెప్పకనే తెలుస్తోంది.ఎన్నికలకు ముందు వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరగడంతో అప్పట్లో జగన్ దీనిని అడ్వాంటేజీగా మలచుకున్నారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ పై నమ్మకం లేదని జగన్ పదే పదే ఎన్నికల ప్రచారంలో జగన్ చెప్పారు. ఒక రకంగా ఈ హత్య కేసులో టీడీపీ నేతల ప్రమేయం ఉన్నట్లు జగన్ ప్రజల్లోకి బలంగా పంపగలిగారు. అయితే వివేకానందరెడ్డి హత్య జరిగిన నాలుగు నెలలకే జగన్ ముఖ్యమంత్రి అయ్యారు.జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కూడా మరో స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం ను ఏర్పాటు చేశారు. సీబీఐకి అప్పగించలేదు. దీంతో వైఎస్ వివేకానందరెడ్డి కుటుంబ సభ్యులతో పాటు మరికొందరు టీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించడంతో హత్య కేసును సీబీఐకి అప్పగించారు. ఇప్పటి వరకూ సీబీఐ ఈ కేసులో ఏమీ తేల్చలేదు. తమకు హత్యకేసుకు సంబంధించి పూర్తి స్థాయి రికార్డులు ఇవ్వాలని సీబీఐ హైకోర్టును ఆశ్రయించడం కూడా చర్చనీయాంశమైంది.వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కొందరు కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అందుకే ఈ హత్య కేసు నుంచి వారిని తప్పించేందుకే జగన్ తరచూ కేంద్రమంత్రి అమిత్ షాను కలుస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో ఎవరు నిందితులన్నది పక్కన పెడితే… దీనికి జగన్ జవాబుదారీగా ఉండక తప్పదు. ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెలలు గడుస్తున్నా బాబాయి హత్య కేసునే ఛేదించలేకపోయారన్న విమర్శలను ఇప్పటికే జగన్ ఎదుర్కొంటున్నారు. రానున్న కాలంలో దీనికి జగన్ జవాబు చెప్పుకునే పరిస్థితి రావచ్చు.

Related Posts