YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

వడదెబ్బకు మూగజీవాలు విలవిల

వడదెబ్బకు మూగజీవాలు విలవిల

ల్గొండలో ఉష్ణోగ్రతల తీవ్రత అధికమవుతోంది. ఈ ఎఫెక్ట్ నానాటికీ అధికమవుతుండడం ప్రజారోగ్యాన్ని ప్రభావితమవుతోంది. ఇక పశువుల విషయానికొస్తే.. ఎండలకు అల్లాడిపోతున్నాయి. ఇప్పటికే వందల సంఖ్యలో మూగజీవాలు వడదెబ్బకు కుదేలయ్యాయి. వీటికి తక్షణమే వైద్య సహాయం అందించాల్సి ఉంది. లేదంటే రైతులు పాడిపశువులను కోల్పోయే ప్రమాదం ఉన్నట్లు అంతా అంటున్నారు. స్థానికంగా టెంపరేచర్లు పెరిగిపోతుండడంతో ప్రజలంతా కూలర్లు, ఏసీల వద్ద సేదతీరుతున్నారు. అయితే మూగజీవాలకు ఈ సౌకర్యం లేకపోవడంతో వాటి పరిస్థితి దయనీయంగా ఉంది. ఉష్ణోగ్రత పెరిగి గాలిలో తేమ తగ్గినప్పుడు పశువులు వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. గాలి ప్రసరణ సరిగా లేకపోవడం, షెడ్లలో ఎక్కువ సంఖ్యలో పశువులు కిక్కిరిసి ఉండటం కూడా సమస్యలను పెంచుతుంది. నీటి సౌకర్యం అందుబాటులో లేకపోవడం పెను ప్రభావమే చూపుతుంది. ఈ అంశాలను దృష్టించి పశువులకు ఎప్పటికప్పుడు ఆహారం అందించడంతో పాటూ మంచినీరు అందుబాటులో ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు.  

వేసవిలో పశువులను పగటిపూట మేతకు బయటకు వదలకూడదని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. తాగునీరు అన్ని వేళలా అందుబాటులో ఉంచాలని, పశువులను రోజుకు రెండుసార్లు చల్లని నీళ్లతో కడగాలని వెల్లడించారు. పశువులను ఉంచే ప్రాంతంలో గాలి వెలుతురు ధారాళంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. పశువుల షెడ్డును రేకులతో నిర్మిస్తే.. షెడ్డుపై గడ్డి పరవడం లేక ఉష్ణాన్ని నిరోధించగల ఏర్పాట్లు చేయాలని సూచించారు. పచ్చని పశుగ్రాసంతో పాటూ ఉప్పు కలిపిన కుడితిని పశువులకు అందించాలి పేర్కొన్నారు. పశువులు వడదెబ్బకు గురైన పక్షంలో వాటిని వెంటనే చల్లని గాలివీచే చోటుకు చేర్చాలని వైద్యులు చెప్తున్నారు. శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి తీసుకరావడానికి పలుమార్లు నీటితో కడగాలని, వాటికి చల్లని తాగునీరు పట్టించాలని అంటున్నారు. సత్వరమే పశువైద్య సిబ్బందికి సమాచారం ఇచ్చి వైద్యుల పర్యవేక్షణలో పశువులకు చికిత్స అందించాలని స్పష్టం చేశారు.

Related Posts