YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

త్వరలో సచిన్ కు లైన్ క్లియర్

త్వరలో సచిన్ కు లైన్ క్లియర్

జైపూర్, డిసెంబర్ 26, 
రాజస్థాన్ రాజకీయాలు ఏ క్షణమైనా మారే అవకాశాలున్నాయి. ఇప్పటికే బీజేపీ రాజస్థాన్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ స్వయంగా ప్రకటించారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అశోక్ గెహ్లాత్ ను ఏఐసీసీ అధ్యక్షుడిగా చేయాలని భావిస్తున్నారు. ఆయన పేరు దాదాపు ఖరారవుతుందని చెబుతున్నారు. అదే జరిగితే రాజస్థాన్ ముఖ్యమంత్రి పదవిని సచిన్ పైలెట్ చేపట్టే అవకాశముంది.రాహుల్ గాంధీ తాను అధ్యక్ష పదవిని చేపట్టబోనని స్పష్టంగా చెబుతున్నారు. సీనియర్ నేతలు ఎవరైనా ఆ బాధ్యతలు చేపట్టవచ్చని సూచిస్తున్నారు. గతంలోనే అశోక్ గెహ్లాత్ పేరు ప్రచారంలోకి వచ్చింది. అయితే తాను ముఖ్యమంత్రిగా ఉన్నందున అధ్యక్ష బాధ్యతలను చేపట్టలేనని చెప్పేశారన్న వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు రాజస్థాన్ పరిస్థితి బాగా లేదు. అక్కడ అసమ్మతి ఎక్కువగా కనపడుతుంది. అలా కాకుండా రాహుల్ గాంధీ అధ్యక్ష పదవి చేపట్టినా సచిన్ పైలెట్ కు అనుకూలంగానే నిర్ణయం ఉంటుంది.
మరోవైపు సచిన్ పైలెట్ వర్గం కూడా అంత సంతృప్తికరంగా లేదు. ఇటీవలే సచిన్ పైలెట్ అశోక్ గెహ్లాత్ ను విభేదించి బయటకు రావడం, వెంటనే రాహుల్ గాంధీ, ప్రియాంకలు నచ్చ చెప్పిన సంగతి తెలిసిందే. వీరి మధ్య సయోధ్య కోసం సమన్వయ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జిని కూడా మార్చారు. అయినా ఈ రెండు వర్గాల మధ్య విభేదాలు ఒక కొలిక్కి రాలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అశోక్ గెహ్లాత్ ఏఐసీసీ అధ్యక్షుడిగా ఎంపికవుతారన్న వార్తలు సచిన్ పైలెట్ వర్గంలో ఆనందాన్ని నింపుతున్నాయి.అశోక్ గెహ్లాత్ ను అధ్యక్షుడిగా ఎంపిక చేయాలని కొందరు సీనియర్ నేతలు కూడా సోనియాకు సూచించినట్లు తెలిసింది. రాహుల్ గాంధీకి గెహ్లాత్ నియామకంపై ఎటువంటి అభ్యంతరాలు ఉండవు. అశోక్ గెహ్లాత్ కూడా ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టి రెండున్నరేళ్లు పూర్తి కావస్తుండంటంతో ఆయనను అధ్యక్ష పదవి చేపట్టాలని పార్టీ గట్టిగా కోరే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ  అధ్యక్షుడయినా సచిన్ పైలెట్ ముఖ్మమంత్రి అవుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
 

Related Posts