YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం విదేశీయం

లక్ష కోట్ల నిమిషాల వీడియో కాల్స్...

లక్ష కోట్ల నిమిషాల వీడియో కాల్స్...

ముంబై, డిసెంబర్ 26, వీడియో కాల్స్.. ఈ మధ్య కాలంలో నార్మల్ కాల్స్ కంటే వీడియో కాల్స్ ఎక్కువైపోయాయి. చిన్న చిన్న వాటికి కూడా వీడియో కాల్స్ నే ఉపయోగిస్తూ ఉన్నారు. ఇక పిల్లోల్ల క్లాస్ లకూ.. లాక్ డౌన్ లో ఎక్కడో ఉండిపోయిన సన్నిహితులు, స్నేహితులతో సంభాషించాలని అనుకున్నా కూడా వీడియో కాల్స్ నే వాడారు. అందులో భాగంగా చాలా యాప్స్ నే ఉపయోగించారు అందరూ..! ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా లక్ష కోట్ల నిమిషాలకుపైగా వీడియో కాల్స్ మాట్లాడారని చెబుతూ ఉన్నారు. ఇది అన్ని వీడియో కాలింగ్ యాప్స్ ద్వారా మాట్లాడిన సమయం కాదు. అదీ ఒక్క గూగుల్ లోనే అట..! ఈ విషయాన్ని స్వయంగా గూగుల్ వెల్లడించింది. ఒక్క ఏడాదిలో అది 1,800 కోట్ల గంటలకు సమానం. గూగుల్ డ్యుయో, గూగుల్ మీట్ సేవలను ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఈ విధంగా ఉపయోగించుకున్నారు. వచ్చే ఏడాది మార్చి 31 నుంచి జీమెయిల్ తో అనుసంధానమై గూగుల్ మీట్ సేవలను ఉచితంగా పొందొచ్చని సంస్థ తెలిపింది. కొత్తగా మీట్ ట్యాబ్ ను జీమెయిల్ లో తీసుకుని వచ్చారు. నెస్ట్ హబ్ మ్యాక్స్, క్రోమ్ క్యాస్ట్ లలోనూ మీట్ ను అందుబాటులోకి తెచ్చారు. హ్యాండ్స్ ఫ్రీ కాల్స్ మాట్లాడుకోవచ్చని గూగుల్ డ్యుయో, మీట్ ప్రొడక్ట్ మేనేజ్ మెంట్ డైరెక్టర్ డేవ్ సిట్రాన్ చెప్పారు. గోప్యత, భద్రతకు ఎలాంటి ఢోకా ఉండదని.. ప్రతి ఒక్కరి సమాచారం రహస్యంగానే ఉంటుందన్నారు. రోజూ గూగుల్ లో సగటున 10 కోట్ల మంది కొత్త వినియోగదారులు చేరుతున్నారు. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో రికార్డు స్థాయిలో రోజూ 23.5 కోట్ల మంది కొత్త వినియోగదారులు అందులో నమోదయ్యారు.జూమ్ కాల్స్ కు పోటీగా తీసుకుని వచ్చిన గూగుల్ మీట్ కూడా బాగా హిట్ అయ్యింది. ఇక జూమ్ లో సెక్యూరిటీ సమస్యలు ఉన్నాయని.. డేటా ను లీక్ చేశారని కూడా కథనాలు రావడంతో చాలా మంది గూగుల్ కు షిఫ్ట్ అయిపోయారు. అందుకే అంత ఎక్కువగా గూగుల్ లో వీడియో కాల్ సదుపాయాన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు వినియోగించుకున్నారు.

Related Posts