YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం విదేశీయం

ఇప్పుడు పబ్ జీ రావడం కష్టమేనా

ఇప్పుడు పబ్ జీ రావడం కష్టమేనా

హైదరాబాద్, డిసెంబర్ 26, 
దేశ సరిహద్దుల్లో చైనాతో నెల‌కొన్న వివాదం కారణంగా దేశ భద్రతా దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం సెప్టెంబరులో 118 చైనా యాప్‌లను భారత ప్రభుత్వం నిషేదించింది. ఈ నిషేధిత జాబితాలో పబ్జి గేమ్ కూడా ఉంది. ఈ గేమ్ నిర్వాహకులు చైనాకు చెందిన టెన్సెంట్ గేమ్స్‌తో ఒప్పందాన్ని రద్దు చేసుకొని ప‌బ్‌జి కార్పొరేషన్ సొంత సంస్థ‌గా భార‌త్‌లో రిజిస్ట‌ర్ చేసుకుంది. "పబ్జి మొబైల్ ఇండియా" పేరుతో భారత్ లో డిసెంబర్ నెలకల్లా సందడి చేయడం పక్కా అని అనుకున్నారు. కానీ ఇంకా ఆలస్యం అవుతూనే ఉంది. భార‌త్‌లో లాంచ్ చేసేందుకు ఇంకా ప‌బ్‌జి కార్పొరేషన్ కి కేంద్రం నుండి అనుమ‌తులు లభించడంలేదు. తాజాగా పబ్జి గేమ్ విడుదలపై ఆర్టీఐ ద్వారా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖను సమాచారం కోరారు. ప్రియమైన సార్/ మేడమ్ 2020 సెప్టెంబర్ నెలలో మీ డిపార్ట్మెంట్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఉత్తర్వుల్లో భాగంగా భారత ప్రభుత్వం వివిధ చైనీస్ యాప్ లను నిషేధించింది. వాటిలో ఒకటి పబ్జి మొబైల్ గేమ్. భారతీయుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడిన ఈ గేమ్ "పబ్జి మొబైల్ ఇండియా" పేరుతో త్వరలో రానున్నట్లు తెలుస్తోంది. మీరు భారత్ లో ప్రారంభించడానికి ఈ గేమ్ కి అనుమతి ఇచ్చారా లేదా అనే విషయం తెలుసుకోవాలని అనుకుంటున్నాను" అని ఆర్టీఐ దాఖలు చేసిన పిర్యాదులో ఉంది.    
ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ప్రతిస్పందిస్తూ.. ''పబ్జి ప్రారంభించడానికి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఎటువంటి అనుమతి ఇవ్వలేదు" అని తెలిపింది. ఈ ఆర్టీఐ ప్రశ్నను నవంబర్ 30న దాఖలు చేసినట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తుంటే పబ్జి ఇప్పట్లో భారత్ లో సందడి చేసే అవకాశాలు లేనట్లే కనిపిస్తూ ఉన్నాయి. భారత్ లో బ్యాన్ చేశాక తిరిగి రావాలని పబ్జి చేస్తున్న ప్రయత్నాలన్నీ బెడిసి కొడుతూ ఉన్నాయి.  

Related Posts