అదిలాబాద్, డిసెంబర్ 26,
గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యం పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది. వారికి అవసరమైన పౌష్టికాహారాన్ని అందించే కూరగాయలు, ఆకుకూరలు సాగుచేసుకునేందుకు అంగన్‌వాడీ కేంద్రాల్లో నే న్యూట్రిషన్ గార్డెన్ల(పెరటి తోటల పెంపకం)ను ఏర్పాటు చేస్తున్నది. ఆయా కేంద్రాల్లో సేంద్రియ పద్ధతిలో సాగు చేసేందుకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ (ఐసీడీఎస్) ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రా ల్లో 90 శాతానికి పైగా ఈ గార్డెన్లను ఏర్పాటు చేయనున్నట్లు ఐసీడీఎస్ అధికారులు తెలిపారు. స్థలాలు ఉన్న చోట అంగన్‌వాడీ కేంద్రాల ఆవరణల్లో, లేని చోట్ల కుండీలు, ప్లాస్టిక్ డబ్బాల్లో కూరగాయలు, ఆకుకూరలకు విత్తనాలను చల్లి పండిస్తున్నారు. ప్రతి యేటా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో సెప్టెంబర్‌లో పోషణ మాసోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈసారి న్యూట్రిషన్ గార్డెన్ల (పెరటి తోటల పెంపకం) ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. జిల్లావ్యాప్తంగా 901 అంగన్‌వాడీ కేంద్రాలుండగా అం దులో 844 ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలు, 57 సూక్ష్మ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 51,151 మంది విద్యార్థులు చదువుతున్నారు. అంగన్‌వాడీల్లో చేరే విద్యార్థ్ధులకు మానసిక, శారీరక వికాసాన్ని పెంపొందించేందుకు వీలుగా అక్కడి టీచర్లు విద్యను బోధిస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలను పోషకాల బ డిగా మార్చుతున్నారు. ఈక్రమంలో అన్ని కేంద్రాల్లో న్యూట్రీగార్డెన్స్ ఏర్పాటు చేస్తున్నా రు. కేంద్రాల్లోని ఖాళీస్థలాల్లో పాలకూర, మెంతి, కొత్తిమీర, పుదీనా, పుంటికూర, టమాట, బెండకాయ, తోటకూర, కాకర, మిర్చి, సోరకాయ, చిక్కుడు, వంకాయలాంటి కూరగాయల సాగును సేంద్రియ పద్ధతిలో సాగుచేస్తున్నారు. దీంతో అం గన్‌వాడీ కేంద్రాలకు వచ్చే బాలింతలు, గర్భిణు లు, మహిళల సంపూర్ణ ఆరోగ్యాన్ని సమకూర్చేందుకు న్యూట్రీగార్డెన్‌లు ఎంతగానో దోహదపడుతాయనడంలో అతిశయోక్తి లేదు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అన్ని రకాలుగా పౌష్టికాహారాన్ని అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రతి అంగన్‌వాడీ కేం ద్ర ఆవరణలో న్యూట్రీగార్డెన్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ఈ్ర కమంలో జిల్లాలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాల ఆవరణల్లో స్థలం వెసులుబాటు ప్రకారంగా సేంద్రియ పద్ధతిలో విత్తనాలను చల్లి మొక్కల పెంపకాన్ని చేపడుతున్నాం. పోషక విలువలు ఉన్న ఆకుకూరలు, కాయగూరల మొక్కలను పెంచుతున్నాం. ప్రతి అంగన్‌వాడీ కేంద్రం ఆవరణల్లో పెంచే మొక్కలను సంబంధిత టీచర్లు శ్రద్ధ వహిస్తున్నారు.