ఖమ్మం డిసెంబర్ 26,
ఖమ్మం జిల్లా వైరా లో బీజేపీ రాష్ట్ర నాయకుడు నేలవెల్లి రామారావు హత్య సంచలనం సృష్టించింది. ఇంటివద్ద నున్న రామారావుపై కత్తితో దాడి చేసారు. తీవ్రగాయాలో పరిస్థితి విషమంగా ఉండటంతో ఖమ్మం హాస్పిటల్ కి తరలించారు.. వైద్యం అందిస్తున్న తరుణంలో ఖమ్మం ఆసుపత్రిలో ఆయన మృతి చెందారు. .ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో దాడి జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నేలవెళ్లి రామారావు బిజెపి స్టేట్ ఆర్టీఐ సెల్ కన్వీనర్ గా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం లో కేబుల్ వ్యవస్థ నిర్వాహకులు జీఎస్టీ కట్టడం లేదు. దాదాపు వేల కోట్ల రూపాయల స్కాం జరుగుతుంది అని ఆర్టీఐ ద్వారా తీసుకున్న సమాచారం తో రామారావు హై కోర్టు లో కేసు వేసారు. ఈ విషయం లో చాలా మంది తెరాసనేతలనుంచి హాని ఉందని ఇటీవల రామారావు పార్టీ పెద్దలకు చెప్పుకున్నారు. రామారావు పై అతని స్నేహితుడు మాడపాటి రాజేష్ దాడి చేసినట్టు గా సమాచారం. రాజేష్ సీపీఎం పార్ట సానుభూతిపరుడు. మధిర కోర్టులో లొంగిపోయేందుకు ప్రయత్నిస్తున్నాడని సమాచారం