YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విదేశీయం

పాకిస్థాన్‌కు 50 చైనా సాయుధ డ్రోన్లు

పాకిస్థాన్‌కు 50 చైనా సాయుధ డ్రోన్లు

బీజింగ్‌ డిసెంబర్ 26
పాకిస్థాన్‌కు 50 సాయుధ డ్రోన్లను చైనా అమ్మింది. ఆయుధాలను మోసుకెళ్లే సామర్థ్యమున్న 50 వింగ్ లూంగ్ 2 డ్రోన్లను ఈ నెలలో పాక్‌కు సరఫరా చేయాలని నిర్ణయించినట్లు చైనా మీడియా తెలిపింది. ఇక భారత సైన్యానికి కాళ రాత్రేనని, పర్వతాల్లో మోహరించిన ఆ దేశ మిలిటరీకి ఈ అత్యాధునిక ఆయుధాలను ఎదుర్కొనే సామర్థ్యం లేదని పేర్కొంది. చైనా, టర్కీకి చెందిన ఇలాంటి డ్రోన్లు లిబియా, సిరియా, అజర్‌బైజాన్ ఘర్షణల్లో సాంప్రదాయ సాయుధ సంపత్తిగలిగిన శత్రువుల రక్షణ వ్యవస్థలను చిత్తు చేశాయని వివరించింది.మరోవైపు చైనా బెదిరింపులను భారత్‌ తిప్పికొట్టింది. వింగ్‌ లూంగ్‌ 2 డ్రోన్ల పనితీరుపై సందేహాలు వ్యక్తం చేసింది. ఒక ప్రాంతం గగనతలంపై మరొకరికి పట్టు ఉన్నప్పుడే డ్రోన్ల ద్వారా దాడి సాధ్యమని పేర్కొంది. ఆఫ్ఘన్‌ గగనతలంపై పట్టు ఉన్న అమెరికా ఉగ్రవాదులపై దాడులు చేస్తున్నవైనాన్ని ఉదాహరించింది. సరిహద్దులోని చైనా లేదా పాకిస్థాన్‌కు ఇది సాధ్యం కాదని భారత్‌ స్పష్టం చేసింది. పాకిస్థాన్‌ వైపు నియంత్రణ రేఖ లేదా చైనా సరిహద్దులోని లఢక్‌ వాస్తవాధీన రేఖపై భారత రాడార్లు, యుద్ధ విమానాల నిఘా ఎల్లప్పుడు ఉంటుందని భారత్‌ పేర్కొంది. ఆయా రేఖలను దాడిన డ్రోన్లను ఆ వ్యవస్థలు వెంటనే పసిగట్టి కూల్చివేస్తాయని భారత వాయుసేన మాజీ చీఫ్‌ వెల్లడించారు. అయితే చైనా నుంచి పాకిస్థాన్‌ ఆయుధ డ్రోన్లను సమకూర్చుకున్న నేపథ్యంలో భారత్‌ కూడా సాయుధ డ్రోన్లను, డ్రోన్ల వ్యతిరేక వ్యవస్థలను సమకూర్చుకోవాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు.

Related Posts