YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఇంకా తేలని టీపీసీసీ..

ఇంకా తేలని టీపీసీసీ..

హైదరాబాద్, డిసెంబర్ 26 
తెలంగాణ పీసీసీ చీఫ్ ఎన్నికపై కాంగ్రెస్ పార్టీలో చాలా రోజులుగా అంతర్గతంగా విభేదాలు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఒకరికి పీసీసీ ఇస్తే మరోకరు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని తేల్చి చెబుతున్నారు. తాము పార్టీని వదిలిపోతామని కూడా ప్రకటనలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా పీసీసీ చీఫ్ ఎన్నికపై తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ రాశారు. ఈ లేఖను జగ్గారెడ్డి సోనియాగాంధీతో పాటు రాహుల్‌, ఇన్‌ఛార్జ్ మాణిక్యం ఠాగూర్‌లకు కూడా రాశారు.పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న సీనియర్లను కాదని కాస్త ఎక్కువ జనాదరణ ఉన్న రేవంత్ రెడ్డికి పీసీసీ ఇస్తారని ఊహాగానాలు రావడంతో సీనియర్లంతా బహిరంగంగానే తమ అయిష్టాన్ని వెళ్లగక్కుతున్నారు. దీంతో కాంగ్రెస్‌ అధిష్టానం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. అయితే, ప్రస్తుతం టీఆర్ఎస్‌తో పాటు బీజేపీని ఎదుర్కోవాలంటే దూకుడుగా ఉండే నేతకే టీపీసీసీ అధ్యక్ష పదవి‌ ఇవ్వాలని హైకమాండ్‌ భావిస్తోంది. ఈ నేపథ్యంలో జగ్గారెడ్డి లేఖ ప్రాధాన్యత సంతరించుకుంది.తెలంగాణలో బీజేపీకి ఎమ్మెల్యేలుగా గెలిచే నేతలు లేకపోవడంతోనే రాజకీయంగా ఎదగడానికి ఆ పార్టీ ప్లాన్‌ చేస్తోందని లేఖలో పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌-ఎంఐఎం పార్టీలను పరోక్షంగా బీజేపీ వాడుకుంటుందని లేఖలో జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఫిబ్రవరి, మార్చిలో రానున్న నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు జాగ్రత్త పడాల్సిన అవసరముందని జగ్గారెడ్డి సూచించారు. జానారెడ్డి నాయకత్వంలోనే ముందుకు వెళ్లాలని లేఖలో ఆయన సూచించారు. సీనియర్ నాయకుల్లో ఏకాభిప్రాయం వచ్చే వరకు పీసీసీ చీఫ్‌ ఎన్నిక ప్రక్రియ ఆపాలని కోరారు. సాగర్‌ ఉప ఎన్నిక వరకు పీసీసీ ఉత్తమ్ కుమార్‌రెడ్డినే కొనసాగించాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు.

Related Posts