YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

*శ్రీరంగం*

*శ్రీరంగం*

వైష్ణవులకు అత్యంత పవిత్రమైన క్షేత్రాలు 108 ఉన్నాయి. పన్నెండు మంది  ఆళ్వారులు తమ రచనలయిన పాశురములలో ఈ 108 విష్ణు రూపాలను కొలిచారు. దివ్య దేశములలో మొదటిది శ్రీ రంగం .ఆళ్వార్లు కీర్తించిన నూట యెనిమిది దివ్య దేశములలో శ్రీ రంగము ప్రధానమైనది. శ్రీరామకృష్ణాది విభవావతారములకు క్షీరాబ్ది నాధుడు మూలమని అర్చావతారములకు శ్రీరంగనాథుడే మూలమని ఆళ్వారుల విశ్వసిస్తారు. . ఆళ్వారుల దివ్య ప్రబంధాలకూ, రామానుజుని శ్రీవైష్ణవ సిద్ధాంతానికీ శ్రీరంగం పట్టుగొమ్మగా నిలిచింది.
*స్థల పురాణము*
వైవస్వత మనువు కుమారుడు ఇక్ష్వాకు మహారాజు. ఆయన బ్రహ్మను గూర్చి తపసు చేసాడు. బ్రహ్మ ప్రీతిచెంది తాన ఆరాధిస్తున్న శ్రీరంగనాథుని ఇక్ష్వాకు మహారాజునకు ప్రసాదించెను. ఆరాధన ఇక్ష్వాకు మహారాజు నుండి శ్రీరామచంద్రుని వరకు కొనసాగింది. శ్రీ రామ పట్టాభిషేకం తరువాత విభీషణుడు శ్రీరామ వియోగమును భరింపజాలక లంకకు మరల లేక పోయాడు. ఆ సమయమున శ్రీరామచంద్రుడు తమకు మారుగ శ్రీరంగనాథుని విభీషణునికి ప్రసాదించాడు. విభీషణుడు సంతుష్ఠుడై లంకకు పయనమయ్యాడు. లంకకు పయనమైన విభీషణుడు శ్రీరంగనాథునితో ఉభయ కావేరి మధ్య భాగమును చేరేసమయానికి సంధ్యా సమయం అయింది. విభీషణుడు స్వామిని అక్కడ ఉంచి సంధ్యావందనము చేసి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన విభీషణుడు శ్రీరంగనాథుడు ప్రణవాకార విమానములో అక్కడే ప్రతిష్ఠితం కావడం చూసి విచారించాడు. శ్రీరంగనాథుడు విభీషణుని ఊరడించి రాత్రి భాగమున శ్రీవిభీషణుని పూజనందుకుంటానని అనుగ్రహించారు. ఇచ్చట గర్భాలయములో శయనించియున్న మూర్తికి "పెరియ పెరుమాళ్" అని పేరు. ఉత్సవ మూర్తికి 'నంబెరుమాళ్‌' అనిపేరు. ప్రపంచంలో అతిపెద్దదైన కంబోడియాలోని అంకార్ వాట్ మందిరం శిథిలావస్థలో ఉన్నది గనుక ప్రపంచంలో పూజాదికాలు జరిగే అతిపెద్ద హిందూ దేవాలయం ఇదే అని భావించవచ్చు. శ్రీరంగం ఆలయ 7 ప్రాకారాలతో, 21 గోపురాలతో విరాజిల్లుతున్నది.. ఈ గోపురాన్ని "రాజగోపురం" అంటాఱు. దీని ఎత్తు 236 అడుగులు (72 మీటర్లు) - ఆసియాలో అతిపెద్ద గోపురం. శ్రీ రంగము ఉభయ కావేరి నదుల మధ్యన గల ఒక ద్వీపము. సప్త ప్రాకారములతో పదునైదు గోపురములతో విలసిల్లు భూలోక వైకుంఠము. రంగనాథ పెరుమాళ్ సాక్షాత్ నారాయణుడు కాగా, శ్రీ మహాలక్ష్మి యే శ్రీ రంగనాయకి . 

Related Posts