YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

దీదీ..ఒంటరి పోరు

దీదీ..ఒంటరి పోరు

బెంగాల్, డిసెంబర్ 28, 
పశ్చిమ బెంగాల్ లో మమత బెనర్జీని ఒంటరి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మమతను మానసికంగా వీక్ చేసేందుకు బీజేపీ తొలి నుంచి ప్రయత్నం చేస్తూనే ఉంది. వీలయినంత మంది తృణమూల్ కాంగ్రెస్ నేతలను పార్టీలోకి చేర్చుకుంటే మరింత బలోపేతం అవుతామని బీజేపీ అంచనాగా ఉంది. అందుకే అమిత్ షా పర్యటన ఉన్నప్పుడల్లా దీదీ గుండె దడదడలాడాల్సిందే. నమ్మకమైన ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా హ్యాండిచ్చి వెళ్లిపోవడం మమత బెనర్జీని షాక్ కు గురి చేస్తుంది.ఇప్పటికీ పశ్చిమ బెంగాల్ మమత బెనర్జీ స్ట్రాంగ్ గానే ఉన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న మమత బెనర్జీకి సహజమైన వ్యతిరేకత ఉన్నప్పటికీ బీజేపీ చేష్టల మూలంగా అది సానుభూతిగా మారే అవకాశాలున్నాయంటున్నారు. మమతను బీజేపీ టార్గెట్ చేయడం బెంగాలీల్లో అసహనం కన్పిస్తుందని చెబుతున్నారు. మమత బెనర్జీ ప్రభుత్వంలో ఎంత తప్పులున్నప్పటికీ ఆమెను ఎన్నికల్లో ఎదుర్కొనలేక బీజేపీ దొడ్డిదారిన వస్తుందన్న విమర్శలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి.మరోవైపు మమత బెనర్జీపై సానుభూతిని పెంచేందుకు గవర్నర్ కూడా యధావిధిగా తనవంతు కృషి చేస్తున్నారు. గవర్నర్ జగదీప్ థన్ కర్ తరచూ మమత బెనర్జీ ప్రభుత్వంపై విరుచుకు పడుతుండటం, పాలనలో జోక్యం చేసుకోవడం కూడా రానున్న ఎన్నికల్లో ప్రభావం చూపుతుందంటున్నారు. బీజేపీ గవర్నర్ ద్వారా బెంగాల్ ను శాసించాలని భావిస్తుందని ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.అమిత్ షా పర్యటనలో మమత బెనర్జీకి బీజేపీ షాకిచ్చింది. తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు బీజేపీ లో చేరిపోయారు. ీరితో పాటు మాజీ ఎంపీ సునీల్ మండల్ కూడా కాషాయ కండువా కప్పుకున్నారు. ఇప్పటికే సువేందు అధికారి చేరడంతో మమత బెనర్జీ సగం బలాన్ని తీసేసినట్లయిందని బీజేపీ భావిస్తుంది. అయితే జరుగుతున్న పరిణామాలన్నీ మమత బెనర్జీకి అనుకూలంగా మారతాయంటున్నారు. ఆమెకు సానుభూతి వచ్చే అవకాశముంది. ఇదే చర్యలతో బీజేపీ ముందుకు సాగితే దీదీకి ప్లస్ అవ్వడం ఖాయమన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.

Related Posts