YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ప్రక్షాళన దిశగా టిఆర్ఎస్

ప్రక్షాళన దిశగా టిఆర్ఎస్

హైదరాబాద్, డిసెంబర్ 28
ఢిల్లీ సందర్శన తర్వాత ఫామ్ హౌస్‌కే పరిమితమైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ కీలక నేతలతో తీవ్రంగా చర్చలు జరుపుతు న్నట్లు తాజా సమాచారం. తెలంగాణ రాష్ట్ర సమితికి కొత్త రక్తం ఎక్కించాలని, ఆ రకంగానే 2023 అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీని ఓడించి మళ్లీ అధికారాన్ని కైవసం చేసుకోవాలని కేసీఆర్ యోచిస్తున్నట్లు అభిజ్ఞవర్గాల సమాచారం. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణలో పన్నుతున్న కొత్త వ్యూహాలను కేసీఆర్ నిశితంగా పరిశీలిస్తున్నారని టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర నాయకత్వాన్ని కూడా మార్చడం ద్వారా ఈ రెండుపార్టీల భవిష్యత్ ప్రణాళికలను ముఖ్యమంత్రి అంచనా వేస్తున్నారు. ఈ రెండు పార్టీల పథకాలను బట్టి తెరాస పార్టీ పని శైలిని మార్చేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు.బీజేపీ తెలంగాణ పార్టీ నాయకత్వాన్ని యువ నేత బండి సంజయ్ కుమార్‌కి కట్టబెట్టింది. దుబ్బాక ఉప ఎన్నికల్లో కానీ, జీహెచ్ ఏంసీ ఎన్నికల్లో కానీ బండి సంజయ్ నాయకత్వంతో బీజేపీ అదికార పార్టీని ముప్పుతిప్పలు పెట్టి షాక్ కలిగించింది. ఇక కాంగ్రెస్ వంతుకొస్తే వచ్చే ఎన్నికల కోసం యువనేతను టీపీసీసీ నేతగా  నియమించడానికి కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఆ ప్రయత్నాలు దాదాపు ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది.గత కొన్ని రోజులుగా సీఎం కేసీఆర్ తన ఫామ్ హౌస్‌కి సీనియర్ నేతలను రప్పించుకుని మంతనాలు సాగిస్తున్నారు. పార్టీ నాయకత్వంలో, ప్రభుత్వంలో కూడా కీలక మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెరాస వర్గాలు చెబుతున్నాయి. తెరాస సీనియర్ నేత ఎమ్మెల్యే డిఎస్ రెడ్యా నాయక్ ఇటీవలే చేసిన వ్యాఖ్య ప్రకారం 2021 ఉగాదికి ముందే సీఎం తనయుడు కేటీఆర్ ముఖ్యమంత్రి కానున్నారని తెలుస్తోంది. ప్రభుత్వ నాయకత్వంలోనే మార్పులు సంభవించనున్న తరుణంలో పార్టీ, ప్రభుత్వం అనుసంధానమై పనిచేయవలసి అవసరముందని కేసీఆర్ భావిస్తున్నారు. దీంట్లో భాగంగానే ఆర్థిక మంత్రి టి.హరీష్ రావు, ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌ని కార్యనిర్వాహక అధ్యక్షులుగా కేసీఆర్ నియమించనున్నట్లు వార్తలు. కొత్త ముఖ్యమంత్రి కానున్న తారక రామారావుకు వీరు తగిన సహాయ సహకారాలు అందిస్తారని కేసీఆర్ భావన.బీజేపీ తెలంగాణలో తన పునాదిని బలపర్చుకుంటే గులాబీ పార్టీకి తీవ్రమైన నష్టం తప్పదని కేసీఆర్ బలంగా భావస్తున్నట్లు తెరాస వర్గాలు చెబుతున్నాయి. బీజేపీని ఎదుర్కోవాలంటే పార్టీపరంగా, ప్రభుత్వ పరంగా దృఢంగా వ్యవహరించేవారు అవసరమని కేసీఆర్ భావిస్తున్నారని తెలుస్తోంది. అందుకే పార్టీ ప్రజా పునాదిని మరింత పెంచుకోవాలని, రాష్ట్ర అధికార యంత్రాంగాన్ని దీనికి అనువుగా మల్చుకోవాలని కేసీఆర్ యోచిస్తున్నారని సమాచారం.పార్టీ కార్యకర్తలు, మంత్రులు ఇకనుంచి క్షేత్రస్థాయిలో ప్రజలతో సన్నిహిత సంబంధాలను కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేసీఅర్ అబిప్రాయం. పార్టీ కార్యకర్తలు, ప్రజా ప్రతినిధుల మధ్య వివిధ స్థాయిల్లో పరస్పర సంబంధాలు కొనసాగాలని దీనికోసం పార్టీలోనూ, ప్రభుత్వ స్థాయిలోనూ చొరవకలిగిన యువనాయకత్వం పగ్గాలు అందుకోవాలని కేసీఅర్ భావిస్తున్నారు. కాబట్టి 2021లో పార్టీలో, ప్రభుత్వంలో భారీస్థాయిలో ప్రక్షాళన జరగబోతోందని ఇంటర్న్లల్ గా టాక్ నడుస్తోంది.

Related Posts