హైదరాబాద్, డిసెంబర్ 28,
బీజేపీ ప్లాన్ మామూలుగా లేదు. ఎలాగైనా సరే.. సౌత్ లో సత్తా చాటాలని చూస్తోంది. ఆల్రెడీ తెలంగాణలో పాగా వేసింది. ఎక్కడో ఒక్క సీటు ఒక్క ఓటు కష్టం అనుకున్న పొజిషన్ నుంచి.. ఎన్నికలు వస్తే మాదే విజయం అనేదాకా వెళ్లింది బీజేపీ. ఇదంతా ఒక్క బండి సంజయ్ వచ్చిన తర్వాతనే మారింది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఒక్క లీడరే.. ఒక బలమైన అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ను సవాల్ చేస్తున్నారు. ఆయన పేరే బండి సంజయ్ అంటూ.. బీజేపీ ఫాలోవర్స్ అంతా.. సవాళ్లు విసురుతున్నారు. అఫ్ కోర్స్.. వస్తున్న రిజల్టులు కూడా అలాగే ఉన్నయ్ మరి. ఇక తిరుపతిలో కూడా సేమ్ టు సేమ్ ఢల్ గా ఉంది బీజేపీ. ఇటు చూస్తే.. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చూపిన లీడర్ సంజయ్ కనిపిస్తున్నారు. అందుకే.. ఆ బాధ్యత కూడా బండి సంజయ్ కే ఇస్తోంది బీజేపీ. ఎన్నికల దాకా కాదు.. కాస్త ముందే హైప్ తీసుకురావాలని చూస్తోంది. దుబ్బాక, గ్రేటర్ లో వచ్చిన రిజల్ట్ తిరుపతిలో తీసుకొచ్చి.. ఏపీలో బీజేపీ కెపాసిటీ ఏంటో చూపించాలని చూస్తోందంట బీజేపీ. ముందే హైప్ తీసుకువస్తేనే ఇలాంటి ప్లాన్స్ వర్కవుట్ అవుతాయని.. సెంట్రల్ పెద్దలు ప్లాన్ చేస్తున్నారట. తిరుపతిలో బండి సంజయ్ పర్యటిస్తే.. వేవ్స్ పాజిటివ్ గా మారతాయి అనుకుంటున్నారట. హిందుత్వంపై బండి సంజయ్ ఏ రేంజ్ లో పీక్స్ కి వెళ్తారో తెలిసిందే కదా. తిరుపతి వెదర్ లో కూడా అలాంటి మూడ్ ఉంటుంది కాబట్టి.. వర్కవుట్ అవుతుంది అనేది అంచనా. ఇక పోతే.. ఎంపీ అరవింద్, రాజా సింగ్ కూడా ఇలాంటి లీడర్లే.. హిందు, హిందూ అంటారు. సో వాళ్లని కూడా బండి సంజయ్ బండెక్కిస్తే.. బండి సంజయ్ తో పాటు అదే బండిపై ఉండి తిరుపతి సీటుని నెగ్గించుకుని వస్తారనేది ప్లాన్ అట.ఇక్కడో తిరకాసు ఉంది. అదే జనసేనతో బీజేపీకి వచ్చిన ప్రాబ్లమ్. ఇన్నాళ్లూ తల ఊపిన జనసేనాని.. సేన అలగడంతో.. తల అడ్డంగా ఊపుతున్నారు. తిరుపతి సీటు కావాల్సిందే అని మొండికేస్తున్నారు. సో.. ఏంటి ఉపయోగం అనే లెక్కలూ ఉన్నయ్. కానీ.. సీటు జనసేనదైనా.. బీజేపీది అయినా.. ఇలా చేస్తే మాత్రం గెలిస్తే క్రెడిట్ బీజేపీకే వెళ్తుంది అనడంలో నో డౌట్. అందుకే.. ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుంది అనేది వాళ్ల లెక్క.