ముంబై డిసెంబర్ 30,
యంగ్ హీరోలు కూడా ఈయన దెబ్బకి విల విలలాడాల్సిందే..అలా అని అతను ఎవరితో పోటీ పడడు..తన పని ఏదో తాను చేసుకుంటూ పోతుంటాడు..అంతేకాదు సంవత్సరానికి 3..4సినిమాల్లో నటించడం కూడా విశేషమనే చెప్పాలి. ఆయనెవరో అర్థమయిందిగా. బాలీవుడ్ సినీ పరిశ్రమ అంతా అతనిని బాలీవుడ్ ఖిలాడి అని పిలుచుకుంటుంది. అతనే అక్షయ్ కుమార్. ఆయన ఎనర్జీకి..ఆయన ఏజ్ కి ఎక్కడా పొంతనే ఉండదు. నిత్యం వర్క్ వుట్స్ తో పాటు ఆయన ఫుడ్ డైటింగ్ కూడా బాగా మెయింటైన్ చేస్తుంటాడు అక్షయ్.అందుకే ఈ 54ఏళ్ల వయసులో కూడా బాలీవుడ్‌లో టాప్ హీరోగా కొనసాగుతున్నారు ఖిలాడీ.స్టార్ హీరోలందరూ ఏడాదికి ఒక‍్క సినిమా విడుదల చేయ్యడమే గగనంగా భావిస్తుంటే.. అక్షయ్ మాత్రం మూడు, నాలుగు సినిమాలు సునాయసంగా చేస్తారు. పైగా ఆయన సినిమాలకు సక్సెస్ రేటు ఎక్కువ. అక్షయ్ సినిమాలు అంటే మినిమం గ్యారంటీ సినిమాలు అనే భావన దర్శక నిర్మాతల్లో ఉంది. ఇక రెమ్యూనరేషన్ విషయంలో కూడా అక్షయ్ టాప్‌లోనే ఉన్నారు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు 117 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారట. ఈ నేపథ్యంలో అక్షయ్ మరోసారి తన రెమ్యూనరేషన్‌ని పెంచనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.2022లో చేయబోయే చిత్రాల కోసం అక్షయ్ ఏకంగా 135 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకోనున్నట్లు బాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. దీని గురించి ఓ సినీ విశ్లేషకుడు మాట్లాడుతూ.. ‘అక్షయ్ సినిమాల శాటిలైట్, డిజిటల్ రైట్స్ కోసం 80-90 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇక ప్రొడక్షన్ బడ్జెట్ వచ్చి 35-45 కోట్ల రూపాయలు ఉంటుంది. ఇక ప్రింట్, పబ్లిసిటీ కోసం మరో 15 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇక రెమ్యూనరేషన్ కాకుండా అక్షయ్ సినిమా ఒవర్ ఆల్ బడ్జెట్ చూసుకుంటే 185-200 కోట్ల రూపాయల వరకు ఉంటుందని తెలిపాడు. ఇక ప్రతి సినిమా బాక్సాఫీస్ దగ్గర మినిమం గ్యారంటీగా నిలుస్తూ.. సుమారు 500 కోట్ల రూపాయల వరకు వసూలు చేస్తోంది. దాంతో తన రెమ్యూనరేషన్‌ని భారీగా పెంచారట అక్షయ్.అక్షయ్ కుమార్ కొన్ని నెలల క్రితం తన పారితోషికాన్ని 99 కోట్ల నుండి 108కు పెంచాడు. ఫైనల్‌గా 117 కోట్ల మార్కుని సెట్ చేశాడు. అయితే 2022లో మాత్రం అక్షయ్ తన ప్రతి సినిమాకు రూ.135 కోట్ల పారితోషికాన్ని తీసుకోనున్నాడని వార్తలు వస్తున్నాయి. అక్షయ్ పాపులారిటీ, అతని సినిమాలకు బాక్సాపీస్ దగ్గర మంచి వసూళ్ళు వస్తున్న నేపథ్యంలో నిర్మాతలు అంత మొత్తం కూడా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక ప్రస్తుతం అక్షయ్ చేతిలో సూర్యవంశి, అత్రాంగి రే, బెల్ బాటమ్, బచ్చన్ పాండే, రక్షా బంధన్, పృథ్వీరాజ్, రామ్ సేతు వంటి సినిమాలు ఉన్నాయి.