హైదరాబాద్ డిసెంబర్ 30,
మద్యం సేవించి డ్రైవింగ్ చేసేవారిపై సంచలన వ్యాఖ్యలు చేశారు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్. ఇక మీదట సైబరాబాద్ పరిధిలో తాగి వాహనం నడిపితే ఐపీసీ 304 కింద కేసులు నమోదు చేసి 10 సంవత్సరాలు జైలు శిక్ష పడేలా చూస్తామని మందుబాబులకు వార్నింగ్ ఇచారు. సోమవారం ఒక్క రోజే 402 మంది తాగి వాహనం నడిపినవారిపై కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేవాళ్లు టెర్రరిస్ట్ లతో సమానం అంటూ అయన వ్యాఖ్యానించారు. ఈ వారం పాటు సైబరాబాద్ పరిధిలో ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ టీమ్స్ ఉంటాయన్నారు.. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, ఏఆర్ తో పాటు ఎస్వోటీ పోలీసులు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ లో పాల్గొంటారని వెల్లడించారు. తాగి రోడ్లపైకి వచ్చి డ్రైవ్ చేసేవారిని ఎవ్వరినీ వదిలేది లేదని వార్నింగ్ ఇచ్చారు సీపీ సజ్జనార్. కాగా, కరోనా సమయంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిలిపివేసారు. తాజాగా మళ్లీ ప్రారంభించిన సంగతి తెలిసిందే.. కరోనా సమయంలో.. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కు ఎలాంటి అనుమతులు లేవని ఇప్పటికే స్పష్టం చేసిన సైబరాబాద్ సీపీ.. ఇప్పుడు మందు బాబులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.