అమరావతి డిసెంబర్ 30,
స్థానిక ఎన్నికల నిర్వహణపై ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం నుంచి మూడు రోజుల లోపు ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ను కలిసి ప్రభుత్వ అభిప్రాయాన్ని వివరించి చెప్పాలని స్పష్టం చేసింది. రాష్ట్ర ఎన్నికల కమీషన్ తో చర్చలు జరపాలని గతంలోనే ఆదేశాలు ఇచ్చిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం, ఈసారి మూడు రోజుల కాల వ్యవధిని నిర్ణయించింది. స్థానిక ఎన్నికలపై ప్రభుత్వ పిటిషన్ను కొట్టివేసిన హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలపైనే స్పష్ఠతను ఇచ్చింది. ఎస్ఈసీతో చర్చల ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశిస్తూ... మూడు రోజులలోపు ముగ్గురు అధికారులను ఎన్నికల కమిషన్ వద్దకు పంపాలని, ఇందుకోసం ఎన్నికల కమిషన్ వేదికను నిర్ణయించాలని ధర్మాసనం పేర్కొంది. భుత్వం తమ అభ్యంతరాలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లాలని, అలాగే ఇంత త్వరగా స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సిన అంశంపై, ఎన్నికల కమిషన్ ప్రభుత్వానికి వివరించాలని సూచించింది.