YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

రైతులను మోసం చేసిన కేసీఆర్ పీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి

రైతులను మోసం చేసిన కేసీఆర్ పీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్ డిసెంబర్ 30,
కొనుగోలు కేంద్రాలు ఎత్తివేయడం పై రాష్ట్ర వ్యాప్తంగా రైతు లు ఆందోళన చెందుతున్నారు. పార్టీ తరుపున మేము ఏం చేయాలనేదానిపై కార్యచరణ రూపొందించాం. రైతు లను మోసం చేసిన కేసీఆర్ కు సీఎం గా కొనసాగే హక్కు లేదని పీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
తెలంగాణ లో ఎక్కువ జనాభా వ్యవసాయం మీదే ఆధారపడి బతుకుతుంది.  అలాంటి వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తుంన్న ప్రభుత్వం మనకు అవసరమా. ప్రభుత్వం దాల్ మీళ్ళు కాదు అంటున్న కేసీఆర్... మరి ఇన్ని రోజులు  కంట్రాక్టర్లకు బ్రోకర్ గా ప్రభుత్వం వ్యవహరించిందా. 70సంవంత్సరాలు గా  ప్రభుత్వాలు ధాన్యాన్ని కొంటున్నాయని అన్నారు.
తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి 10లక్షల కోట్ల బడ్జెట్ ఖర్చయితే...ధాన్యం కొనుగోలు వల్ల వచ్చిన 7500 కోట్ల నష్టం ఓ లెక్కా.  రియల్ ఎస్టేట్ చేసే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ను సివిల్ సప్లే కమిషన్ గా పెట్టారు..మీ అసమర్థత వల్లే ఈ నష్టం వచ్చింది. ప్రతీ గ్రామంలో కొనుగోలు కేంద్రాలను 2004లోనే కాంగ్రెస్ ఏర్పాటు చేసింది..కేసీఆర్ దయా దాక్షిన్యాల మీద ఐకేపీ సెంటర్ లు పెట్టలేదు. ధాన్యం కొనుగోలు ప్రభుత్వం భాధ్యత... ప్రభుత్వం బాధ్యత గుర్తొంచేలా కాంగ్రెస్ ఉధ్యమం చేస్తుంది. ఢిల్లీ వెళ్లి కేసీఆర్ , బీజేపీ తో సయోధ్య కుదుర్చుకున్నారని అయనఅన్నారు. ఇక్కడ బండి సంజయ్ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. రైతు లు పండించిన ప్రతీ గింజను ప్రభుత్వం మద్దతు ధరకు కొనాల్సిందే. 30 నుంచి 7 వరకు మండల కేంద్రాలలో అవగాహన సమావేశాలు, నిరసనలు, తహసీల్దార్ కు వినతి పత్రాలు సమర్పణ వుంటుంది. 11న జిల్లా కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు, 18న రాష్ట్ర వ్యాప్త పోరాటాలు. మధ్యలో ఒకసారి రౌండ్ టేబుల్ సమావేశం వుంటుందని అయన అన్నారు. 

Related Posts