హైదరాబాద్ డిసెంబర్ 30, ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు ప్రజల సమస్యలపై ద్రుష్టి పెట్టి వాటి ప్రరిష్కారానికి కృషి చెయ్యాలని హిమాచల ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు.మంగళవారం జాతెయ బిసి సంక్షెమ సంఘం అద్యక్షులు ఆర్.కృష్ణయ్య ఆదేశాలమేరకు తెలంగాణ రాష్ట్ర బిసి సంక్షెమ సంఘం అద్యక్షులు యెర్ర సత్యనారాయణ ఆద్వర్యంలో రవీంద్ర భారతి లో ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల్లో గెలుపొందిన బిసి కార్పోరేటర్ల సన్మాన సభకు దత్తాత్రేయ ముఖ్య అతిధిగా విచ్చిసి కర్పోరేతర్లను సన్మానించారు..ఈ సందర్బంగా దత్తాత్రేయ మాట్లాడుతూ ప్రజా సమస్యల పై ప్రజా ప్రతినిధులు స్పందించి వారి సమస్యలు పరిస్కరించినపుడే పదికాలాలపాటు వారు ప్రజల్లో నిలువగలరన్నారు.ఈ కార్యక్రమం లో జాతీయ బిసి సంక్షెమ సంఘం అద్యక్షులు ఆర్.కృష్ణయ్య,పార్లమెంటు సబ్యులు అసదుద్దిన్ ఒవైసీ, జాతెయ బిసి సంక్షెమ సంఘం ఉపాధ్యక్షులు గుజ్జ కృష్ణ,బిసి యువజన సంఘం రాష్ట్ర అద్యక్షులు నీలా వెంకటేష్, పి.సుదాకర్,మల్లేష్ యాదవ్,బండి కృష్ణ,నాగోలు బ్రమ్మయ్య , టైగర్ చంటి ముదిరాజ్,మనోహర్ తదితరులు పాల్గొన్నారు.