న్యూ ఢిల్లీ డిసెంబర్ 31,
ఓటరు కార్డ ఐడిని ఆధార్ కార్డతో లింక్ చేయటం వల్ల చాలా ఉపయోగాలుంటాయని జనాలు ఎప్పటి నుండో డిమాండ్ చేస్తున్న ఎలక్షన్ కమీషన్ పట్టించుకోవటం లేదు. అయితే ఎన్నికల ప్రక్రియలో సంస్కరణలను తీసుకురావాలని పౌర సంఘాల నుండి కేంద్ర ఎన్నికల కమీషన్ పై తీవ్రమైన ఒత్తిడి పెరిగిపోతోంది. అందుకనే సంస్కరణలపై కమీషన్ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే కొన్ని సంస్కరణలపై కమీషన్ కసర్తు చేసి ఆమోదం కోసం కేంద్ర్రప్రభుత్వానికి పంపింది. ఎందుకంటే ఈ సంస్కరణలకు ప్రజా ప్రాతినిధ్య చట్టంలో మార్పులు చేయాల్సుంటుంది. దీనికి పార్లమెంటులో చర్చించి బిల్లులు ఆమోదించ ఆమోదం కోసం రాష్ట్రపతికి పంపాల్సుంటుంది. అందుకనే కేంద్రానికి పంపింది కమీషన్. కమీషన్ పంపిన సంస్కరణలపై కేంద్రమంత్రివర్గ సమావేశం చర్చింది బిల్లుల రూపంలో పార్లమెంటులో ప్రవేశపెడుతుంది. ఇందులో ప్రధానమైనదేమంటే ఓటరుకార్డును ఆధార్ కార్డుతో లింకు చేయటం. దీనివల్ల దొంగఓట్లు వేయటం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. ఎందుకంటే ఓటరు కార్డులు లేకుండా ఏదో పద్దతిలో దొంగఓట్లు వేసుకుంటున్నారు. కానీ ఆధార్ కార్డు ప్రకారం ఒకళ్ళ నెంబర్ దేశంమొత్తం మరొకళ్ళకు ఉండదు. అందుకనే ఆధార్ కార్డును ఓటరుకార్డుతో లింకు చేస్తే దొంగఓట్లకు అవకాశం తగ్గిపోతోందని జనాలు మొత్తుకుంటున్నారు. ఇపుడు దానికి కమీషన్ ఓకే చెప్పింది.అలాగే ఇపుడు ఓటు వేయాలంటే ఎవరైనా పోలింగ్ బూత్ కు రావాల్సిందే. కానీ తీసుకు రావాలని అనుకుంటున్న సంస్కరణల ప్రకారం ఈ ఓటర్ కార్డును ప్రవేశపెట్టబోతోంది. దీని వల్ల ఉపయోగం ఏమిటంటే ఓటరు పోలింగ్ బూత్ కే రావాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చుని లేదా ఇంటర్నెట్ సెంటర్ నుండి కూడా ఓట్లు వేసుకోవచ్చు. అంటే ఇఫ్పటికే ఇటువంటి సౌకర్యం విదేశాల్లో ఉంది. దీనివల్ల పోలింగ్ బూత్ ల్లో రద్దీ తగ్గిపోతుంది. అలాగే ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. ఈ సంస్కరణలన్నింటినీ 2021లో పూర్తి చేసేయాలని కమీషన్ భావిస్తోంది. నిజానికి ఈ డిమాండ్ జనాల్లో ఎప్పటి నుండో వినిపిస్తోంది. మరి కేంద్రం ఏమంటుందో చూడాలి.