YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ప్రమోషన్ల విషయంలో ఏపి హైకోర్టు కీలక ఉత్తర్వులు

ప్రమోషన్ల విషయంలో ఏపి  హైకోర్టు కీలక ఉత్తర్వులు

అమరావతి డిసెంబర్ 31,  ప్రమోషన్ల విషయంలో ఏపి  హైకోర్టు కీలక ఉత్తర్వులు స్వయంగా కోర్టుకు హాజవ్వాలంటూ రాష్ట్ర డీజీపీ,హోంశాఖ ప్రధాన కార్యదర్శికి నోటీసులు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖ లో ప్రమోషన్ల విషయంలో రాష్ట్ర  హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. స్వయంగా కోర్టుకు హాజవ్వాలంటూ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ హోంశాఖ ప్రధాన కార్యదర్శి విశ్వజిత్ కు హైకోర్టు నోటీసులు ఇచ్చింది.  వచ్చే ఏడాది జనవరి 25 న హైకోర్టు ముందు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చింది.అసలు వీరికి హైకోర్టు ఎందుకు నోటీసులు జారీ చేసింది అంటే ..  ఏలూరు పరిధిలో ఎస్ ఐ గా విధులు నిర్వర్తిస్తున్న యు.రామారావుకు సీఐ గా ప్రమోషన్ కల్పించే ప్యానల్  లో స్థానం కల్పించాలని హైకోర్టు ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చింది. అయితే  హైకోర్టు ఇచ్చిన ఆ ఆదేశాలను రాష్ట్ర హోంశాఖ అధికారులు అమలు చేయలేదు. దీనితో ఎస్ ఐ రామారావు కోర్టు ధిక్కరణ కింద మరోసారి పిటిషన్ ను దాఖలు చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు  డీజీపీ హోంశాఖ ముఖ్యకార్యదర్శి ఏలూరు రేంజ్ ఐజీ లకు నోటీసులు ఇచ్చింది. కౌంటర్ దాఖలు చేయాలంటూ ఆదేశాలు జారీచేసింది. అయితే తాజాగా మరోసారి ఈ కేసు హైకోర్టు విచారణకు వచ్చింది. డీఐజీ తరఫున న్యాయవాది విచారణకు హాజరవగా డీజీపీ హోంశాఖ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తరఫున ఎవరూ హాజరుకాలేదు. దాంతో హైకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. స్వయంగా విచారణకు హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

Related Posts