YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ప్రజలకు దగ్గరవుతున్న కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్

 ప్రజలకు దగ్గరవుతున్న కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్

కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ తో బాబు జనాలకు మరింత దగ్గరయ్యారు. గత ఏడాది  జూన్ 1 నుంచి 750 మంది సిబ్బందితో పని ప్రారంభించింది. తాజాగా ప్రభుత్వం వినూత్నంగా ప్రవేశపెట్టిన కైజాలా సమాచార వ్యవస్థలో భాగంగా ‘కనెక్ట్ ఏపి సీఎం’ యాప్‌ను  బాబు ఆవిష్కరించారు.ఈ వ్యవస్థతో ప్రభుత్వ పనితీరు, సంక్షేమ కార్యక్రమాలు అందుతున్న వైనం, ఎమ్మెల్యేలు అందుబాటులో ఉంటున్నారా? లేదా?, స్థానికంగా మీరు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్య, తదితర ప్రశ్నలను రోజుకోవిధంగా ఆ యాప్‌లో పొందుపరుస్తారు. యాప్ ద్వారా ప్రజలిచ్చే సమాధానాలు కేవలం చంద్రబాబు ఒక్కరికే తెలిసేలా సాంకేతిక వ్యవస్ రూపొందించారు.కొద్దిరోజుల నుంచి బాబు కసరత్తు చేసి ఊపిరిపోస్తున్న సాంకేతిక వ్యవస్థలను చూస్తే ఇలాంటి అనుమానాలే వ్యక్తమవుతున్నాయి. రెండేళ్లలో జరిగే ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటినుంచే అప్రమత్తమవుతున్నారు. అనునిత్యం జనజీవనంతో ముడిపడి ఉండే పౌరసరఫరాలు, రెవిన్యూ, విద్యుత్, పోలీసు, వైద్యం వంటి కీలక విభాగాల్లో సేవలు ఎలా ఉన్నాయనే అంశాన్ని నేరుగా పరిశీలించే సాంకేతిక వ్యవస్థను బాబు ఏర్పాటు చేయించారు. ఇటీవలే 25 ప్రభుత్వ శాఖల్లో కాల్‌సెంటర్లుకు టోల్‌ఫ్రీ నెంబర్ ఇచ్చి ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు, సలహా సూచనలు తీసుకునే వినూత్న సమాచార వ్యవస్థ ద్వారా క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుసుకుని..దానికి తగ్గట్టు పరిష్కారాలు చూపిస్తున్నారు. బాబుకు నమ్మకస్తులైన అధికారుల బృందం దాన్ని నిరంతరం పర్యవేక్షించి, దానికి అనుగుణమైన చర్యలు తీసుకుంటుంది. దీనిపై రోజువారీ సమీక్షలు జరుపుతున్నారు. కైజాలా యాప్ ద్వారా వచ్చిన సమాచారంపై ఆయా విభాగాలను అప్రమత్తం చేయడం, సర్కారు శాఖల్లో అవినీతి ఉంటే ఏసిబీ, నిఘా వ్యవస్థలకు చేరవేయడం, మళ్లీ శాఖలవారీగా సమాచారాన్ని సంబంధిత మంత్రుల సమీక్ష సమావేశాల్లో ప్రస్తావించడం వంటి చర్యలతో అందరినీ అప్రమత్తం చేయడమే బాబు అసలు లక్ష్యమంటున్నారు. ఆ ఫలితాల ఆధారంగానే బాబు ప్రణాళికలు తయారు చేసి ప్రజలకు దగ్గరయ్యేందుకు సిద్ధమవుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

Related Posts