కడప డిసెంబర్ 31,
టీడీపీ నేత నందం సుబ్బయ్య హత్యకు వైకాపా కు సంబంధం లేదు. సీపీ హత్యా రాజకీయాలను ప్రోత్సహించదని -జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, రాజంపేట మాజీ ఎమ్మెల్యే అకేపాటి అమరనాథ్ రెడ్డి అన్నారు. హత్యకు గురైన నందం సుబ్బయ్య క్రిమినల్ ట్రాక్ రికార్డ్ ఏంటో తెలియకుండా లోకేష్ వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదమని అన్నారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే కి టీడీపీ నేత హత్య తో సంబంధం అంతగట్టడం దారుణమని వారన్నారు. కేవలం మీడియాలో ఫోకస్ కావడానికే లోకేష్ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎవరు హత్యకు గురైనా వైకాపా నేతల పనే అనడం విచారకరమని వారన్నారు.