3 చోట్ల బీజేపీ.. కాంగ్రెస్‌కు 2
ఏపీలో తిరగబడ్డ జాతకాలు
13 చోట్ల వైఎస్‌ఆర్‌సీపీ హవా
టీడీపీ-బీజేపీ కూటమికి 12
జాతీయ స్థాయిలో ఎన్డీయేకు 335
ఈసారి యూపీఏ గెలిచే స్థానాలు 89
రిపబ్లిక్ టీవీ-సీ ఓటర్ సర్వేలో వెల్లడి
ఈ ఏడాది చివర్లో... లేదా వచ్చే సంవత్సరంలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్ బలం పెద్దగా చెక్కు చెదరబోదని సర్వేలు చెబుతున్నాయి. ఆ ఎన్నికలలో టీఆర్‌ఎస్ 12 లోక్‌సభా స్థానాలలో గెలుస్తుందట. సీనియర్ పాత్రికేయుడు అర్ణబ్ గోస్వామి సొంతంగా స్థాపించిన రిపబ్లిక్ టీవీ... సీ ఓటర్ సంస్థతో కలిసి చేసిన సంయుక్త సర్వే ఫలితాలు చూస్తే ఇది ఖాయువునిపిస్తోంది. తెలంగాణలో బీజేపీ మూడు లోక్‌సభా స్థానాలను కైవసం చేసుకుంటుందని, కాంగ్రెస్ రెండుచోట్ల గెలుస్తుందని ఈ సర్వేలో చెప్పారు. నిజానికి క్షేత్రస్థాయిలో చూస్తే బీజేపీ కంటే కాంగ్రెస్ సంస్థాగతంగా బలంగా కనిపిస్తోంది. నాయుకులు కూడా ఆ పార్టీలోనే చురుగ్గా కనిపిస్తున్నారు. కానీ సర్వే వివరాలు మాత్రం ఇందుకు భిన్నంగా వచ్చాయి. 2014 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మోదీ హవా నడిచినా, తెలంగాణలో మాత్రం బీజేపీకి ఒకే ఒక్కస్థానం దక్కింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కూడా బీజేపీ కేవలం ఐదు డివిజన్లలోనే గెలిచింది. పార్టీకి నగర పరిధిలో ఐదుగురు ఎమ్మెల్యేలున్నా.. ప్రయోజనం ఏమీ కనిపించలేదు. కానీ ఈసారి మూడు ఎంపీ స్థానాలు ఎలా వస్తాయో సర్వే చేసినవాళ్లే చెప్పాలి.
ఏపీలో జగన్ దూకుడు
అధినేత తర్వాత పార్టీలో చెప్పుకోదగ్గ బలమైన నాయుకులు ఎక్కువమంది కనిపించకపోయినా.. క్షేత్రస్థాయిలో బలం ఎంతుందన్నది ఇం కా తెలియుకపోయినా వరుసపెట్టి పార్టీ నుంచి బయుటకు వలసలు ఎన్ని కనిపించినా.. ప్రజల్లో మాత్రం వైఎస్‌ఆర్‌సీపీకి బలం బాగానే ఉందని రిపబ్లిక్-సీ ఓటర్ సర్వేలో తేలింది. రాబోయే లోక్‌సభ ఎన్నికలలో రాష్ట్రంలోని మొత్తం 25 లోక్‌సభా స్థానాలకు గాను వైఎస్‌ఆర్‌సీపీ 13 చోట్ల గెలుస్తుందని, టీడీపీ-బీజేపీ కూటమికి మిగిలిన 12 వస్తాయని ఈ సర్వే చెప్పింది. 2014 సంవత్సరంలో 17 స్థానాలను గెలుచుకున్న ఈ కూటమి.. తన బలంలో ఐదు స్థానాలను కోల్పోతుందని స్పష్టం చేసింది. మరోైవెపు వైఎస్‌ఆర్‌సీపీకి ప్రజల్లో బలం పెరగడం వల్ల ఆ పార్టీ లోక్‌సభా స్థానాల విషయంలో తన బలాన్ని పెంచుకుంటుందని తెలిపింది. అయితే.. ప్రస్తుతం వైఎస్‌ఆర్‌సీపీకి రాజకీయ సలహాదారుగా ఉన్న ప్రశాంత కిషోర్ చేయించుకున్న సొంత సర్వేలో మాత్రం ఫలితాలు ఇంత ఆశాజనకంగా ఉన్నట్లు చెప్పలేదని వినికిడి. ఆ సర్వే వివరాలు ఎక్కడా ఇంతవరకు బయుటపడలేదు.
రజనీ హవా!
గతంలో ఇండియాటుడే చేసిన సర్వేలో తమిళనాట ఇంకా పేరు ప్రకటిం చని రజనీకాంత్ పార్టీ కేవలం 33 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే గెలుస్తుందని చెప్పగా.. రిపబ్లిక్ టీవీ మాత్రం ఏకంగా 23 ఎంపీ సీట్లను కైవసం చేసుకుంటుందని చెబుతోంది. డీఎంకేకు 13, అన్నాడీఎంకేకు 3 స్థానాలు వస్తాయట.
జాతీయ స్థాయిలో...
నరేంద్ర మోదీ - అమిత్‌షాల సారథ్యంలో విజయువిహారం చేస్తున్న బీజేపీ రాబోయే ఎన్నికల్లో 335 లోక్‌సభా స్థానాలలో గెలుస్తుందన రిపబ్లిక్ టీవీ- సీ ఓటర్ అంచనా వేసింది. ప్రధాని మోదీకి 66 శాతం మంది మద్దతు పలకగా, రాహుల్‌గాంధీకి కేవలం 28 శాతం మందే మద్దతుగా నిలిచారన్నారు. యూపీఏ భాగస్వామ్య పార్టీలన్నింటికీ కలిపి 89 స్థానాలు మాత్రమే వస్తాయని చెప్పారు. కర్ణాటకలో మళ్లీ బీజేపీ తన కాషాయుధ్వజాన్ని ఎగరేసే అవకాశాలున్నాయని అంటున్నారు. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రైమెన ఉత్తరప్రదేశ్‌లో ఎన్డీయేకు 60, యూపీఏకు 18, ఇతరులకు 2 స్థానాలు వస్తాయని చెప్పారు. మోదీ సొంత రాష్ట్రైమెన గుజరాత్‌లో ఎన్డీయేకు 23, యూపీఏకు 3 సీట్లు వస్తాయున్నారు. దేశ రాజధాని అయిన ఢిల్లీలో మొత్తం 7 లోక్‌సభ స్థానాలూ ఎన్డీయే ఖాతాలోకే వెళ్తాయట. దక్షిణ భారతంలో ఆ పార్టీకి ఒక్క కర్ణాటక తప్ప వేరెక్కడా పెద్దగా ఆశలు లేకపోయినా ఏకంగా 61 శాతం లోక్‌సభా స్థానాలు ఆ పార్టీకే ఎలా దక్కుతాయో చూడాలి. సర్వే ఫలితాలు అన్నీ ఏకపక్షంగా కనిపిస్తున్నాయని, చూడబోతే కావాలని బీజేపీ.. దాని మిత్రులకు అధిక న్యాయం చేయుడానికి ప్రయుత్నించినట్లు క నిపిస్తోందని కొన్ని వివుర్శలు సైతం వచ్చాయి.