న్యూఢిల్లీ డిసెంబర్ 31
క్రోషియాను భూ ప్రకంపనలు వణికిస్తున్నాయి. రెండు రోజుల క్రితం సంభవించిన భూకంపం తరువాత అక్కడ భూప్రకంపనలు కొనసాగుతున్నాయి. సోమవారం అక్కడ 5.2 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఇక మంగళవారం మరోసారి భూకంపం రావడంతో క్రోయేసియా అల్లకల్లోలమయింది. భూకంప ధాటికి ఇప్పటి వరకు ఏడుగురు మరణిం చారు. మరో 20 మందికి గాయాల య్యాయి. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. చాలా చోట్ల భవనాలు కూలిపో యాయి. రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. ఆర్మీ కూడా సహాయ కార్యక్రమాల్లో పాల్గొంది. భూకంపంతో మా పట్ణణం పూర్తిగా ధ్వంసమయిం దని అధికారులు తెలిపారు. భూకంప భయంతో జాగ్రెబ్ ప్రజలు వణికిపోయారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. క్రోయేషియా చుట్టుపక్కల దేశాలైన సెర్బియా, బోస్నియా, స్లోవేనియా, ఆస్ట్రియాలోనూ భూప్రకంపనలు సంభవించాయి. భవనాల పై కప్పులు కూలిపోయాయి. వీధులన్నీ భవన శిధిలాలతో నిండిపోయాయి.