YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

జపాన్ లో గజాననుడు

జపాన్ లో గజాననుడు

భారతదేశంలో గణపతి ఆరాధన ఎంత తీవ్రంగా ఉన్నదో అందరికీ తెలుసు.
8 వ శతాబ్దంలో  చైనా నుండి బౌధ్ధ మతస్థులు  గజముఖదేవుని  జపానుకి  తీసుకువెళ్ళారు.  జపాన్ లో దైవం అనే తమిళ పదం తెన్ అనే చిన్న మార్పుతో ఉపయోగపడుతున్నది తెన్ అనే మాట పురుష దైవాలకు  తైయ్యో అనే పదం స్త్రీ దైవాలకి ఉపయోగిస్తారు. జపాన్ లో గజముఖుడైన వినాయకుని  బినాయక్ తెన్ అంటారు. బౌద్ధ మతం ప్రాచీన కళింగ, వంగ దేశాలలో విస్తారంగా వున్న రోజుల్లోనే ,  వినాయకుని బినాయక్ గా సంభోధించడం ఆరంభమయింది. ' బినాయక్ ' అనే ఆ పేరునే  జపాన్ లో పలుకుతున్నారు. వినాయకుని జపాన్ లో  తాయిషో తెన్ అని అత్యంత పెద్ద దేవునిగా పిలుస్తారు. తాయి అంటే జపాన్ లో పెద్దది అని అర్ధం. జపాన్ యువతకు వినాయక దేవుడు ప్రేమికులను కలిపే దైవముగా;
పెద్దలందరికీ వృత్తి వ్యాపారాలలో మంచి లాభాలు కలిగించే ఐశ్వర్యదేవునిగా పూజింపబడుతున్నాడు. టిబెట్ లో మహాకాళుడు ముఖ్యదైవమైనందున అక్కడ  మహాదేవుని క్రిందనే వినాయకుడు కనిపిస్తాడు. జపాన్ లో ముఫ్ఫైరెండు రూపాలలో వినాయకుడు పూజింపబడుతున్నాడు. వినాయకుని 32 రూపాలలో ఒకటి  దువి  అనబడే ద్విముఖ  వినాయకుడు. రెండు ముఖాలు గజముఖాలే. ఈ భగవానుని' Janus of India ' అని పిలుస్తారు. జేనస్  రెండు ముఖములు కలిగిన దేవత. ఆ రెండు ముఖాలు భూత, భవిష్యత్ కాలాలను తెలుపుతుంది.  ఈ దేవత పేరు మీదే  ఇంగ్లీష్ లో జనవరి అనే మొదటి  మాసం  ఆరంభమైనట్లు చెపుతారు. ఆవిధంగా రెండు ముఖాల గణపతి  భూత భవిష్యత్ కాలాలకి మధ్య బంధంగా చెప్తారు. ఈ బినాయక్ తెన్ నాలుగు దిక్కులను అధిపతిగా 6 వ శతాబ్దం నుండి పూజించబడుతున్నాడు. అష్ట దిగ్గజాలు  అష్ట దిక్కులను కాపాడడం ఇటువంటిదే. నేపాల్ లో వినాయకునికి రెండు ఎలుకవాహనాలు వున్నవి. ఇక్కడ బుధ్ధుడు తన  శిష్యుడైన ఆనందుడికి గణపతి హృదయం అనే మంత్రాన్ని అనుగ్రహించాడనే నమ్మకం వున్నది. ఈ మంత్రం పఠించిన పిదపే నేపాల్ దేశ వ్యవసాయదారులు తమ పొలాలలో పంట కోతల పనులు ఆరంభిస్తారు. నేపాల్ రాజధాని అయిన ఖాట్మాండ్ లో, మహాసర్పం ఛత్రం పట్టుకునివుండగా, ఆరు హస్తాలతో వినాయకుడు దర్శనమిస్తున్నాడు.  వినాయకునికి గల అనేక పేర్లలో జ్యేష్టపుత్ర  అనేది ఒకటి. మలయాళం లో జ్యేష్టన్ అంటే పెద్ద కుమారుడు అని అర్ధం .  జ్యేష్టన్ అనేమాట కాలక్రమేణా చేటన్ గా మారింది. అన్నగారిని, పెద్దలను
చేటన్ అని పిలుస్తారు. బౌధ్ధ మతంలో శక్తికి చిహ్నంగా భావించే గజముఖం, మానవశరీరం  కలిగిన దైవమూర్తి 6 వ శతాబ్దంలో తమిళనాడు కి వచ్చి , ఇక్కడి నుండి బౌధ్ధ సన్యాసులద్వారా చీనా  ,జపాన్ దేశాలకి వెళ్ళింది.  ఈ నాటికి ఆ దేశాలలో  శక్తికి, ధనసంపదలకి, విజయాలకి కారకునిగా పూజలు చేస్తారు. 

Related Posts