YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కామినేని శ్రీనివాస్..కిం కర్తవ్యం

కామినేని శ్రీనివాస్..కిం కర్తవ్యం

విజయవాడ, జనవరి 2, 
ఆయన మాజీ మంత్రి. బీజేపీలో ఉన్నప్పటికీ ఆయన తెలుగుదేశం మంత్రిగానే హావాను కొనసాగించారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆశీస్సులతో ఆయన బీజేపీలో చేరిన వెంటనే మంత్రిపదవి దక్కింది. ఆయనే కామినేని శ్రీనివాస్. తెలుగుదేశం, బీజేపీ కలసి ఉన్నంత కాలం యాక్టివ్ గా ఉన్నారు. కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గానే పాల్గొన్నారు. కానీ గత కొంతకాలం నుంచి ఆయన అన్నింటికి దూరంగా ఉంటూ వస్తున్నారు.ప్రధానంగా సోము వీర్రాజు రాష్ట్ర అధ్యక్షుడు అయిన నాటి నుంచి కామినేని శ్రీనివాస్ జాడ కన్పించడం లేదు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను పదవి నుంచి తప్పించిన అంశంలో కామినేని శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించారు. బీజేపీ అధినాయకత్వం ఆమోదంతోనే తాను హైకోర్టులో పిటీషన వేశారని కామినేని శ్రీనివాస్ చెప్పారు. తర్వాత హైదరాబాద్ లో ఒక హోటల్ లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కలిసిన విషయంలో కూడా కామినేని శ్రీనివాస్ వార్తల్లో వ్యక్తి అయ్యారు.కానీ అప్పటి నంచి కామినేని శ్రీనివాస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన ఎక్కువగా హైదరాబాద్ కే పరిమితమయ్యారంటున్నారు. గతంలో కన్నా లక్ష్మీనారాయణ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు పార్టీ కార్యక్రమాల్లో కన్పించేవారు. కానీ సోము వీర్రాజు అధ్యక్షుడయిన నాటి నుంచి టీడీపీ అనుకూల నేతలకు ఆయన ప్రాధాన్యత ఇవ్వడం లేదు. పైగా సుజనా చౌదరి వంటి నేతలనే పక్కన పెట్టారు.దీంతో పార్టీలో ఇమడలేకపోతున్నామని కామినేని శ్రీనివాస్ తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఇటీవల హైదరాబాద్ వచ్చిన బీజేపీ ముఖ్యనేతను కలసి కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. అందుకే తాను దూరంగా ఉంటున్నానని, స్వేచ్ఛగా అభిప్రాయాలను కూడా తెలియజేసేందుకు పార్టీలో అవకాశం లేకుండా పోయిందని కామినేని శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. తెలంగాణ పార్టీకి, ఏపీ పార్టీకి నాయకత్వం విషయంలో చాలా తేడాలున్నాయని కామినేని శ్రీనివాస్ పలువురి వద్ద అభిప్రాయపడినట్లు తెలిసింది.

Related Posts