YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రోజుకో సమస్యతో జగన్

రోజుకో సమస్యతో జగన్

విజయవాడ, జనవరి 2, 
ఏమిటీ.. ఘోరం.. చంద్రబాబు ప్రతి రోజూ ప్రభుత్వానికి వేసే ప్రశ్న ఇది. తన హయాంలో మానభంగాలు జరగనట్లు. అత్యాచారాలు అసలు లేనట్లే చంద్రబాబు నిత్యం మాట్లాడుతున్నారు. ఇన్ని ఘోరాలకు కారణం జగనేనట. ఆయన తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటే రాష్ట్రంలో అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయట. పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టించడం వల్లనే ఏపీలో హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయంటున్నారు. ప్రజలంతా రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేయాలని చంద్రబాబు పిలుపునిస్తున్నారు.జగన్ ప్రభుత్వం ఏర్పడి నాటి నుంచి చంద్రబాబు ప్రభుత్వం ఫెయిల్ అనే మాట్లాడుతున్నారు. అరాచకం జరుగుతుందంటున్నారు. ప్రజల మాన, ధన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందంటున్నారు. మొన్న ఏలూరులో అంతుచిక్కని వ్యాధి వస్తే వెంటనే జగన్ రాజీనామా చేయాలన్నారు. ఇందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఇప్పుడు ఏలూరు పరిస్థితి కుదుటపడింది. ఎప్పటికప్పుడు జరుగుతున్న సంఘటనలను ప్రభుత్వానికి ఆపాదిస్తూ చంద్రబాబు అధికారం నుంచి పక్కకు తప్పుకోమంటున్నారు.అసలు రాష్ట్రంలో పాలన అనేదే లేదన్నది చంద్రబాబు వాదన. వారానికి రెండు మూడు అత్యాచారాలు జరుగుతుండటానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని చంద్రబాబు చెబుతున్నారు. ఈ ఘోరాలకు మొత్తం జగన్ దే బాధ్యత అంటున్నారు. పైగా అత్యాచార బాధితుల కుటుంబాలను జగన్ ఎందుకు పరామర్శించరని చంద్రబాబు నిలదీస్తున్నారు. గతంలో ప్రతి ఇంటికి ఓదార్పు యాత్ర చేసిన జగన్ కు ఇప్పుడు బాధితులను పరామర్శించే ఓపిక లేదా? అని చంద్రబాబు నిలదీస్తున్నారు.అందుకు కలసి జగన్ ను ఎదరించాలని చంద్రబాబు పిలుపునిస్తున్నారు. ప్రజలంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లపైకి రావాలని ఆయన నినదిస్తున్నారు. ప్రజలు తిరగబడితేనే రౌడీలు తోకముడుస్తారంటున్నారు. పోలీసు శాఖ పూర్తిగా భ్రష్టుపట్టిందని ఆరోపిస్తున్నారు. పార్టీ నేతలపై వరస దాడులు, ఆర్థిక మూలాలు జగన్ దెబ్బతీస్తున్న సమయంలో చంద్రబాబు ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. చంద్రబాబు మాటలను పార్టీ నేతలే లెక్క చేయడం లేదని, ప్రజలు ఎందుకు రిసీవ్ చేసుకుంటారని వారు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద చంద్రబాబు ప్రజలు తిరగడాలని పదే పదే పిలుపునివ్వడం చర్చనీయాంశమయింది.

Related Posts