YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

జూన్ 7న కాలా...

 జూన్ 7న కాలా...

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన తాజా చిత్రం 'కాలా'. పా.రంజిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాని ర‌జ‌నీకాంత్ అల్లుడు, యువ క‌థానాయ‌కుడు ధ‌నుష్ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మించారు. నానా ప‌టేక‌ర్‌, అంజ‌లి పాటిల్‌, హ్యుమా ఖురేషి, ఈశ్వ‌రీ రావ్ త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమాకి సంతోష్ నారాయ‌ణ్ సంగీత‌మందించారు. ఇదిలా ఉంటే.. ఏప్రిల్ 27న విడుద‌ల కావాల్సిన ఈ సినిమా.. త‌మిళ సినీ ప‌రిశ్ర‌మ‌లో చోటుచేసుకున్న స‌మ్మె కార‌ణంగా వాయిదా ప‌డింది. కాగా.. ఈ సినిమాని జూన్ 7న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు చిత్ర బృందం  అధికారికంగా ప్ర‌క‌టించింది.  త‌మిళంతో పాటు తెలుగు, హిందీ, మ‌ల‌యాళ భాష‌ల్లోనూ అదే రోజున తెర‌పైకి తీసుకురానున్న‌ట్లు చిత్ర నిర్మాత ధ‌నుష్‌తో పాటు.. చిత్రాన్ని రిలీజ్ చేస్తున్న లైకా ప్రొడ‌క్ష‌న్స్ కూడా ప్ర‌క‌టించింది. 

Related Posts