YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

*కర్మ స్వరూపం*

*కర్మ స్వరూపం*

ఒక ఉత్తమ జీవితం లో గొప్ప కర్మ ఆంటే ఎంతో ధనం సంపాదించడం కాదు.గొప్ప గొప్ప పదవులను పొందడం కాదు. అత్యున్నత మేధా సంపద పొందం కూడా కాదు. తాను పొందిన వాటి తో అతడు ఎంత సేవ చేసాడు , ఎంత గుణ సంపన్నుడయ్యాడు అన్నదే ముఖ్యం. ఏ స్వార్ధం లేకుండా అతడు తన శక్తులన్నీ ఉపయోగిస్తే , అతడికి సేవ చేయడం కోసమే , ఎన్నో కొత్త శక్తులు లభిస్తాయి.ఆంటే కానీ దివ్య శక్తుల కోసం వ్యామోహం తగదు..నిజానికి అందరినీ ప్రేమించడం ఒక దివ్య శక్తి, , ఎంత నొప్పించే మాటలు అంటున్నా వారితో కూడా స్నేహం గా , మనస్సు లో కూడా కోపం తెచ్చుకోకుండా మాట్లాడటం ఒక దివ్య శక్తి.. ఇలాంటి వారె ఎంతో గురు కృప దైవసనుగ్రహం పొందుతారు..వీరు తమ ప్రేమ తో సమస్త కర్మలు జయించగలరు..కర్మలు వస్తాయి కానీ వీరు ఆ కర్మల వలన బాధించబడరు. ధ్యానం వలన ప్రజ్ఞా స్థితి. ని ఊర్ధ్వ స్థితి కి తీసుకు పోవడం ద్వారా వీరు శారీరక వేదన లు కూడా అనుభవించరు. కర్మలు వస్తాయి..శరీరం బాధ పడుతుంది.. కానీ వీరు నవ్వుతూనే ఉంటారు..ఒక హిప్నాటిస్ట్ ఒక వ్యక్తి ని హిప్నాటిజానికి గురి చేసినప్పుడు మనం ఎన్నో ప్రదర్శన లను వేదిక మీద చూసాము..
ఎంతో కారం కలిగిన మిరపకాయలు తింటున్న వ్యక్తి హైప్నాటిజానికి గురి అయినప్పుడు , ఎలా ఉంది అని అడిగితే , అతడు అవి " చాలా తీయగా ఉన్నాయి " అని చెప్పడం విన్నాము. ఒక పరాయి వ్యక్తి మన శరీరాన్ని నాడీ మండల వ్యవస్థ ని నియంత్రించి తాను చెప్పిందే మనకు అనిపించే లా చేయ గలిగితే , మనం ధ్యానంలోకి వెళ్లి ఇదే పని మన శరీరం పై చేయ లేమా. ధ్యానం ఎంతో విశిష్టమైనది. 
మన ప్రేమ ప్రపంచం-కర్మ స్వరూపం. ప్రేయసీ ప్రియుల బంధం కన్నా అత్తా కోడళ్ల కర్మ బంధం గొప్పది గట్టిది. ఈ జన్మ లో ప్రేయసీ ప్రియులు వచ్చే జన్మ లో భార్యా భర్తలు అయ్యే అవకాశాల కన్నా అత్తా కోడళ్ళు భార్య భర్తలు అయ్యే అవకాశం ఎక్కువ. దీనికి ఒక్కటే కారణం. మనస్సు కర్మ క్షేత్రం. మనస్సు ఎంతసేపు ఏ విషయాన్ని మననం చేస్తారు అన్నది ప్రధాన విషయం. పొద్దున్నే ఒక వ్యక్తీ మిమ్మల్ని పొగిడితే ..కొంత సేపు జ్ఞాపకం ఉంచుకుంటారు. అదే మిమ్మల్ని ఒక్క పరుష వాక్కు తో గాయ పరిస్తే రోజంతా ఒక్కో సారి చాలా కాలం గుర్తు ఉంటుంది. మనస్సు ప్రేమ ని కన్నా వేదనని ఎక్కువగా మననం చేస్తుంది. మీరు ఆ క్షణం లోఅరచి పోతారా , గుర్తు పెట్టుకుని , పదిమంది కీ ఆ బాధలు చెప్పుకుంటారా? దానివలన ఎంత ఎక్కువగా ఒక వ్యక్తీని, విషయాన్ని వస్తువునీ మననం చేస్తే , అది కర్మ బంధనం అవుతుంది. మనం ముందు ఋణానుబంధాలు తీర్చుకోవాలి. ఈ కారణం గా ఒక్కసారి ఎంతో ఆత్మీయులు ఇంత బాధ పెడుతున్నారే అనిపిస్తుంది. వారు ఆత్మేయులే కానీ వారికి ఎప్పుడో అపచారం చేసాం. శత్రువులు మిత్రులు ఎవరు లేరు..గత జన్మ లోని మన కర్మ ఫలాలని ఇప్పుడు ఒక ప్లేట్ లో పెట్టి ఇప్పడు ఇస్తున్నారు. ప్రేమ కూడా ఇంకా శక్తిమంతం అవుతుంది. మన మనస్సులో ఒక ఉత్తమ ప్రేమ భావం ఉంటె ప్రక్రుతి లో దీనిని గమనించే ఎన్నో శక్తులు ఉన్నాయి. దానిని పది రెట్లు చేస్తాయి అదృశ్య గురువులు దేవతలు కూడా మీ పైకి ఇంకా అద్భుతం గా ప్రేమించే శక్తి ఇస్తారు. దాని వలన మీరు చేసే కర్మ ఫలం మీదే. క్రోధం కూడా ఇలాంటి ఫలాన్నే ఇస్తుంది. క్రోధం తో విచక్షణ కోల్పోయిన వారిని గమనించే శక్తులు కూడా ప్రక్రుతి లో ఉన్నాయి అవి మన క్రోధాన్ని పది రెట్లు చేస్తాయి. ఆ శక్తి తో హత్యలు చేసిన వారున్నారు .అంత తీవ్ర క్రోధం మీది కాదు కర్మ ఫలం మాత్రం మీదే.దీని వలన ఎప్పుడు మన మనస్సి ప్రసన్నంగా ఉండాలి. సూర్యోదయం నుండి రాత్రి మనం నిద్రపోయే వరకు మనస్సు తో, మాటల తో , శరీరం తో చేసే ప్రతి పని కి కర్మఫలం ఉంటుంది. ఏ చిన్న పని అయినా , దానికి తగిన ఫలం ఇవ్వక పోదు. మన ఆలోచనలే ప్రధానంగా మన కర్మలని రూపొందిస్తాయి..
ఒకరి పై క్రోధం మనస్సులో దాచుకుంటే అది ఎదో ఒక రోజు కఠినమైన వాక్కు గానో , శృతి మించితే చేయ రాని పనులకు దారి తీస్తుంది " పగ గలిగిన మనస్సు పామున్న ఇల్లు " అన్నాడు ధర్మరాజు మహాభారతం లో .ఆ కర్మ ఫలం ఈ జన్మ లోను, కొన్ని సందర్భాల్లో వచ్చే జన్మ లోను అనివార్యం గా పొందక తప్పదు. ఇది ప్రక్రుతి నియమం..ఎవరో మనపై రుద్దింది కాదు..అంతా " స్వయం కృతం" భార్య పిల్లలు తల్లి తండ్రి మనం చేస్తున్న ఉద్యోగం ప్రేమలు శాస్త్ర పాండిత్యం. అంతా గత జన్మ వాసన ల ముద్రల ప్రభావం. ఇవి అనివార్యం..ఋణం కాని ప్రేమ కాని రెండు మన బంధాలకి కారణం అవుతాయి..ఋణం వలన మాత్రమె చేరువ ఐన వాళ్ళు ఋణం తీరాక మనల్ని విడిచి వెళ్ళిపోతారు..
ప్రేమ వలన చేరువ ఐతే అది రోజు రోజుకి పెరుగుతుంది జన్మ జన్మ కి వెంట వస్తుంది. ఋణం బంధనం...ప్రేమ ఒక బంధం...అందుకేగా " ఋణానుబంధ రూపేణ పతి పత్నీ సుతాదయః అన్నారు. రామాయణం లో సీతమ్మ శ్రీ రాముడితో ఇలా అంటుంది. 
" ధర్మాదర్ధ ప్రభావతీ ధర్మాత్ ప్రభావాటే సుఖం
ధర్మేణ లభతే సర్వం ధర్మ సార మిదం జగత్ "
వాల్మీకి రామాయణం అరణ్యకాండ.
"ధర్మం పాలించడం వల్లనే అర్ధం లభిస్తున్నది.ధర్మాచరణ వల్లనే సుఖం జ్ఞానం మోక్షం కూడా లభిస్తాయి. మనం ఇప్పుడు అనుభవిస్తున్న ప్రతి సుఖం పూర్వ పుణ్య ఫలమే." ..ఇందులో ఒక రహస్యం ఉంది...మళ్ళీ ఆయా సుఖాలే పొందాలంటే మళ్ళీ ఆ సుఖ భోగ ప్రాప్తి లభింప జేసే కర్మలు చేయ వలసిందే..
.మానవ జీవిత లక్ష్యం. కేవలం ధనం అది ఇచ్చే సుఖాలు భోగాలు మాత్రమేనా. మానవ జీవిత లక్ష్యం ఇంకేమయినా ఉందా ? ఎవరికి వారు అసలు నా జీవిత లక్ష్యం ఏమిటి ? అని ప్రశ్నించుకోవాలి. సమస్త భోగాలు, ఐశ్వర్యాలు ,సంపదలు, పదవులు, అన్నీ ఒక రోజు వదిలి పెట్టి వెళ్లి పోతాము..
ఒక్క జ్ఞానం మాత్రమే జన్మ జన్మ కి వృద్ధి చెందుతూ , మనతో జన్మ జన్మ కి వెంట వస్తున్నది. " ఒక రోజు లో జ్ఞానం సంపాదించుకోవడానికి ఎంత సమయం ఇస్తున్నాము..? " . అని మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి....
ఎవరైనా జ్ఞానాన్ని బోధించినా, " ఇలా జ్ఞానం బోధించే వారు. ఆచరించి చెబుతున్నారా ? అని ప్రశ్నిస్తారే తప్ప , ఆ జ్ఞానం మనకెంతో ఉపయోగ పడుతున్నదనే విషయం జ్ఞాపకం పెట్టుకోరు...."
నహి జ్ఞానేన సదృశం "

Related Posts