విదేశాలు చాలా పరిశుభ్రంగా ఉంటాయి.చాలా క్రమశిక్షణ పాటిస్తారు. నీరు స్వఛ్ఛంగా ఉంటుంది .ఆహారం కల్తీ ఉండదు, వస్తువులు నాణ్యమైనవి ఉంటాయి. భారతదేశం లో పుట్టి పెరిగిన ఎందరో మేధావులు, ధనికులు ఇక్కడ అక్షరాలు నేర్చుకుని ,విదేశాల్లో స్థిరపడి ,భారతదేశం కి రావడం ఇష్టంలేక, అక్కడే సిటిజన్స్ అయిపోయిన వారు ఎన్నో లక్షల కుటుంబాలు ఉన్నాయి..
ఇక్కడ మన భారతదేశం లో కుప్పతొట్టిలు ,ఇంకా చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. అన్ని రోడ్ పైన విసిరేస్తూంటారు. అవసరాన్ని బట్టి అన్ని రోడ్ పక్కనే కానిచేస్తుంటారు. మురికి కాలువల పక్కన ,పకోడీ బండి ఉన్నా ,జనం కరువు వచ్చినట్టు ,కొనుక్కుని తింటుంటారు. ఆహారం కల్తీ ,నీరు కల్తీ, లంచాలతో, మోసాలతో ,జనం కల్తీ కుల రాజకీయాలు, నల్ల ధనం ,కబ్జాలు, ఇలా అనేక సుగుణాలు తో ఉన్న మన జనం. కానీ అన్ని రకాల వైరస్లు ,రోగాలు, ముందుగా విదేశాల్లో నే ఎందుకు పుడతాయి.ఎందుకు అంత మంది మరణిస్తున్నారు? అశుభ్రంగా ఉండే భారత దేశం లో నాణ్యత లేని కలుషిత ఆహారం తినే భారతదేశం లో ఎందుకు మొదలు కావడం లేదు? బైలాజికల్ వెపన్స్ తో దాడి చేసి జబ్బులను వ్యాప్తి చేసి న విదేశాల్లో తమని తాము కాపాడుకోలేక కొత్త వైరస్లు కూడా మొదలు ఐయ్యింది..దానికి కారణం భారతదేశం లో విశ్వప్రాణాశక్తిని అధికంగా ఆకర్షించే ప్రాంతాలు గుర్తించి అక్కడ దేవాలయం నిర్మించి యంత్రాన్ని ప్రతిష్ఠించి నిత్యం పూజలు అభిషేకాలు హోమాలు తో వేద మంత్రాలతో ఆ ప్రాంతంలో అధికసంఖ్యలో రేకి శక్తి అభివృద్ధి చెందుతూ ఉంటుంది ఆ చుట్టుప్రక్కల ఉన్న ప్రతి ప్రాణికి అక్కడికి వచ్చిన భక్తులకు ఆ ప్రాంతంలో విశ్వప్రాణాశక్తిని (cosmic energy) రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.. నిత్యం భారతదేశం లో వివిధ ప్రాంతాల్లో హోమాలు ,వేద పారాయణం, నిత్యాగ్ని హోత్రం చేసే వారు వివిధ ఉపాసకుల మంత్రోచ్చారణ ప్రకృతిలోని పోసిటివి ఎనర్జీ ని అధికంగా పొందే విధంగా చేస్తుంది ఆ ఉచ్చారణ వల్ల శబ్ద తరంగాలు వల్ల నేగటివ్ పవర్ తగ్గుతుంది ఎప్పుడూ శుభాన్ని ఉచ్చరించే శబ్ద తరంగాలు శుభాన్ని కలిగిస్తుంది హోమంలో వేసే ఆవు పిడకలు వాతావరణం లోని కాలుష్యం తగ్గిస్తుంది గో పూజ, వేప చెట్టు, అధికంగా కాస్మిక్ పవర్ ప్రసరించే పుణ్య నదులలో స్నానం ఇవన్నీ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. నిత్యం జరిగే పూజ జపం తపస్సు ఇక్కడ క్షేత్రాలకు ఉన్న శక్తి మనకు అందిస్తుంది, ఇది మన దేశంలో గొప్పతనం మన సనాతన ధర్మం మనం భారతీయులం మనం అదృష్టవంతులము.