YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

నేరాలు తెలంగాణ

ప్రేమించలేదని కాల్ గర్ల్ గా పోస్ట్

 ప్రేమించలేదని కాల్ గర్ల్ గా పోస్ట్

శాడిస్టుల అకృత్యాలకు అంతే లేకుండా పోతోంది.ఒక్కడు ఒక్కో విధానాన్ని ఎంచుకుంటున్నారు. మొన్న తిరుపతిలో ఓ  శాడిస్టు భర్త అదనపు కట్నం తీసుకురాలేదని భార్యని వేధించడంతో పాటు ..చివరికి ఆమె న్యూడ్ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి ఆమెను కాల్ గర్ల్ అని గంటకు రూ. 3 వేలకు బుక్ చేసుకోవచ్చని పోస్టు చేసాడు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ ఘటన మరువక ముందే హైదరాబాద్ లో ఇటువంటి ఘటనే జరిగింది.కొద్ది రోజులుగా ఓ యువతి వెంట పడుతున్న యువకుడు ఆమె తన ప్రేమను తిరస్కరించిందన్న కోపంతో అక్కసు  పెంచుకున్నాడు.ఏకంగా ఆమె ఫోటోలను మార్పింగ్ చేసి డేటింగ్ యాప్స్ లో అప్ లోడ్ చేసాడు. ఆమెకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి కాల్స్ వస్తుండటం భరించలేక విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్ళడంతో వారు రంగంలోకి దిగి ఆ దుర్మార్గుడిని అరెస్ట్ చేశారు.కింగ్ కోటికి చెందిన మహ్మద్ సమీర్ కి తను చదువుకునే కళాశాలలో ఓ యువతి పరిచయం అయ్యింది. కొద్ది రోజులు వారు స్నేహంగానే మెలిగారు. ఆ తర్వాత అతడు. తనని ప్రేమించాలని వేధించడం మొదలు పెట్టాడు. అందుకు ఆమె తిరస్కరించడంతో మహ్మద్ సమీర్ ద్వేషం పెంచుకున్నాడు. ఆ యువతి ఫోటోలు సేకరించి వాటిని అసభ్యంగా మార్పింగ్ చేశాడు. వాటిని డేటింగ్ యాప్స్ లో అప్ లోడ్ చేశాడు.ఆమె కాల్ గర్ల్ అని ప్రచారం చేసాడు. వాటి కింద యువతి ఫోన్ నంబర్ ఇతర వివరాలు పోస్టు చేసాడు.   దీంతో బాధిత యువతికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్స్ వస్తుండటంతో భరించలేక పోలీసులను ఆశ్రయించింది.  దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రేమను తిరస్కరించిందన్న అక్కసుతో స్నేహితుడే ఈ పనికి పాల్పడినట్లు తేల్చి అతడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

Related Posts