YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

దేశీయం

భారత్ నుంచి బంగ్లాదేశ్ కు ఉగ్రవాదుల స్వరంగా మార్గం

భారత్ నుంచి బంగ్లాదేశ్ కు ఉగ్రవాదుల స్వరంగా మార్గం

భారత్ లో విధ్వంసాలు సృష్టించడమే లక్ష్యంగా ఉగ్ర వాదులు నిత్య ఏదో ఒక మార్గంలో దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే అక్రమ చొరబాట్లపై నిఘా పెరగడంతో ఉగ్ర వాదులు దేశంలోకి ప్రవేశించేందుకు ఏకంగా టన్నెల్స్ నిర్మిస్తున్నారు. ఏ ప్రాంతంలోకి చొరబడాలో ముందే నిర్ణయించుకుని అందుకు అనుగుణంగా టన్నెల్స్ తవ్వేస్తున్నారు. ఇటీవల టన్నెల్స్ ద్వారా ఉగ్రవాదుల చొరబాటు అధికమవడంతో భద్రతా దళాలు అంతర్జాతీయ సరిహద్దు వెంట టన్నెల్స్ ఎక్కడెక్కడ ఉన్నయో గుర్తించే పని చేపట్టారు. బీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు.సాంబా సెక్టార్లో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి 150 మీటర్ల పొడవున్న ఓ టన్నెల్ ని గుర్తించారు. గ్రోటా ఎన్ కౌంటర్ లో హతమైన నలుగురు జైషే ముష్కరులు ఈ టన్నెల్ గుండానే భారత్ లోకి ప్రవేశించినట్లు అధికారులు నిర్ధారించారు. కాగా తాజాగా అసోం రాష్ట్రంలో ఉగ్రవాదులు చొరబాటుదారులు అక్రమంగా నిర్మించారని భావిస్తున్న ఓ సొరంగం బయటపడింది.  ఇది ప్రస్తుతం సంచలనంగా మారింది. అసోం రాష్ట్రం కరీంగంజ్ జిల్లాలో దీన్ని గుర్తించారు. ఏకంగా ఇక్కడ భారత్ నుంచి బంగ్లాదేశ్ కు టన్నెల్ ఏర్పాటు చేసి ఉండటం భద్రతా బలగాలను నివ్వెరపరిచింది.
సరిహద్దుకు ఆ పక్క ఓ వ్యక్తిని అపహరించి తీసుకెళ్లారని కేసు నమోదవగా దర్యాప్తు క్రమంలో శుక్రవారం పోలీసులు భద్రతా బలగాలు ఈ సొరంగాన్ని గుర్తించాయి. ఈ విషయమై సరిహద్దు బలగాలు రంగంలోకి దిగి విచారణ చేపట్టాయి. కరీంగంజ్ జిల్లా బంగ్లాదేశ్ తో 92 కిలోమీటర్ల సరిహద్దు పంచుకుంటోంది. భద్రతా దళాల నిఘా ఎక్కువగా ఉండటంతో ఉగ్ర వాదులు చొరబాటుదారులు భారత్ లోకి ప్రవేశించేందుకు ఏకంగా సొరంగాలు ఏర్పాటు చేసుకుంటుండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.

Related Posts