ముఖ్యమంత్రి కేసీఆర్ పతనం మొదలైంది ఆరోపించారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి.పోలీసులు కేసీఆర్ చూసి ఎగరకండి జాగ్రత్త ఉండండి మేము ఎవరిని వదిలిపెట్టాం అని హెచ్చరించారు.అధికార పార్టీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఒత్తిడితో జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జంగా రాఘవ రెడ్డి పైన అక్రమ కేసులు పెట్టి జైలు పంపించారు అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వరంగల్ వెళుతున్న మార్గ మధ్యలో భువనగిరి మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన ఘాటుగా విమర్శించారు.ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పోలీసులు చట్టం,ధర్మం,రాజ్యాంగం పరిధిలో పని చేయండి ఎక్సస్ట్రలు చేయకండి హెచ్చరించారు.
ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ కు పోయే రోజులు దగ్గర పడ్డాయి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.సోయిలేని మాటలను మాట్లాడుతున్న కేసీఆర్. ముఖ్యమంత్రి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపైన అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన రాజకరుల పాలన కంటే గోరంగా ఉంది ఆరోపించారు. కేసీఆర్ పాలన కంటే రజాకారుల పాలన భేష్ అన్నారు. వచ్చే రెండు ఏండ్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయo. జనగామ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి అరెస్టును రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుoదని తెలిపారు.