YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్

టెన్షన్, టెన్షన్ గా రామతీర్థం

టెన్షన్, టెన్షన్ గా రామతీర్థం

విజయనగరం జిల్లా రామతీర్థం ఉద్రిక్తంగా మారింది. అగ్ర నేతల పర్యటనలతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. కొండపై ఆలయాన్ని పరిశీలించి బయటకు వచ్చిన విజయసాయిరెడ్డి, వైఎస్సార్‌సీపీ నేతల్ని టీడీపీ, బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. కొండపైకి వైఎస్సార్‌సీపీ జెండాలతో వెళ్లడాన్ని నిరసిస్తూ ధర్నాకు దిగారు.. ఈ క్రమంలో టీడీపీ,బీజేపీ-పోలీసుల మధ్య తోపులాట జరిగింది. విజయసాయిరెడ్డి కారుపై కొందరు దాడి చేశారు.. అద్దాలు ధ్వంసం చేశారు. చెప్పులు, రాళ్లతో దాడికి దిగారు. ఈ తోపులాటలో విజయనగరం బీజేపీ మహిళా నేత కిందపడిపోయారుఇటు రామతీర్థానికి టీడీపీ, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. గుడి మెట్లపై వైఎస్సార్‌సీపీ నేతలు బైఠాయించారు.. చంద్రబాబును కొండపైకి వెళ్లనిచ్చేది లేదంటున్నారు. ఇటు బీజేపీ కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగా ధర్నాకు దిగింది.. గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్నారు. దీంతో ముందస్తు జాగ్రత్తగా పోలీసుల్ని భారీగా మోహరించారు. మరికాసేపట్లో చంద్రబాబు రామతీర్థం చేరుకోబోతున్నారు.. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు ఆయన్ను అడ్డుకుంటామనడంతో హైడ్రామా కనిపిస్తోంది.
బాబును అడ్డుకున్న పోలీసులు
విజయనగరం జిల్లాలో ముఖ్య నేతల పర్యటనలతో ఉద్రిక్తతలు కనిపిస్తోంది. రామతీర్థం వెళ్లేందుకు చంద్రబాబు జిల్లాకు చేరుకోగా.. పోలీసులు కాన్వాయ్‌లోని ఒక వాహనానికే అనుమతి ఇచ్చారు. కేవలం చంద్రబాబు కాన్వాయ్‌కి అనుమతి ఇచ్చి.. మిగతా వాహనాలు రాకుండా లారీలు అడ్డుపెట్టారు. పోలీసుల తీరుకు నిరసనగా చంద్రబాబు రోడ్డుపై బైఠాయించారుటీడీపీ నేతల వాహనాలను అనుమతించాలని డిమాండ్‌ చేశారు. పోలీసుల తీరుపై టీడీపీ నేతల ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కాన్వాయ్‌ని అడుగడుగునా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. మూడు రోడ్ల జంక్షన్‌ వద్ద మమ్మల్ని అడ్డుకున్నారని, చంద్రబాబుతో కలిసి తమని వెళ్లనివ్వకపోవడం దారుణమన్నారు. తర్వాత టీడీపీ నేతలతో పోలీసులు చర్చలు జరిపారు.. కొందరు నేతలు రామతీర్థం వెళ్లేందుకు అనుమతించారు.. దీంతో పరిస్థితి కాస్త సద్ధుమణిగింది. మరోవైపు చంద్రబాబు రామతీర్థం పర్యటనతో విజయనగరం జిల్లాలో పలువురు టీడీపీ నేతలను అరెస్ట్ చేయగా..మరికొంత మందిని హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Related Posts