అమరావతి జనవరి 4,
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ జోయ్మల్య బాగ్చి సోమవారం ఉదయం ప్రమాణస్వీకారం చేశారు. హైకోర్టు సీజే జేకే మహేశ్వరి ఆయనతో ప్రమాణం చేయించారు. జస్టిస్ బాగ్చి ఇంతకుముందు కోల్కతా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. మరోవైపు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి బదిలీ అయ్యారు. సిక్కిం హైకోర్టు సీజేగా బదిలీ చేస్తూ కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులిచ్చింది. న్యాయమూర్తి మహేశ్వరికి ఘనంగా వీడ్కోలు పలికారు. 1966 ఆక్టోబర్ 3 న జన్మించిన జస్టిస్ జోయ్మల్య బాగ్చి కలకత్తా యూనివర్సిటీనుంచి 1991 న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. కలకత్తా హైకోర్టు లో న్యాయవాదిగా ప్రాక్టీసు చేసారు. క్రిమినల్, రాజ్యంగ అంశాలనూ పలు కేసులు వాదించారు. బంగ్లదేశ్ రచయిత్ర తస్లీమా నస్రీన్ రాసిన ద్వీఖండిత పుస్తకం నిషేధంపై కూడా కేసు వాదించారు. మానవ హక్కులు, పర్యావరణాలపై పలు ప్రజా ప్రయోజనాల వాజ్యాలను కూడా వాదించారు. కేంద్ర ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంలకు జీపీగా పనుచేసారు. న్యాయవ్యవస్థపై పలు రచనలు చేసారు మొదటగా కలకత్తా హైకోర్టులో న్యాయమూర్తిగా 2011 జూన్ 27 న నియమితులయ్యారు.