YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

రేణుకా..ఇక దూరమే...

రేణుకా..ఇక దూరమే...

ఖమ్మం, జనవరి 4,
కాంగ్రెస్ సీనియర్ నేత రేణుక చౌదరి పూర్తిగా రాజకీయాలకు దూరమయినట్లే కన్పిస్తున్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో ఓటమి అనంతరం ఆమె పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడటం లేదు. కాంగ్రెస్ వరస ఓటములతో తెలంగాణలో బలహీనమవుతున్నా రేణుక చౌదరి లాంటి సీనియర్ నేతలు పార్టీని పట్టించుకోవడం లేదు. కేవలం ఎన్నికలకు ముందు వచ్చి హల్ చల్ చేయడం తప్పించి పార్టీకి ఉపయోగపడేందుకు పనిచేయడం లేదు.కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అందరూ లీడర్లే. అదే అధికారంలో లేకపోతే మాత్రం ఎవరికీ కన్పించరు. 2004 నుంచి 2014 వరకూ అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఆ పదేళ్లు మాత్రం రేణుక చౌదరి ఢిల్లీలో ఉన్నప్పటికీ రాష్ట్ర రాజకీయాల్లో కూడా వేలు పెట్టారు. రేణుక చౌదరికి ఆ పదేళ్ల పాటు తెలంగాణ కాంగ్రెస్ లో ఒక ప్రత్యేక వర్గం ఉంది. తన సామాజికవర్గం నేతలనే కాకుండా అందరినీ తన వైపునకు రేణుక చౌదరితిప్పుకునేవరు.కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రేణుక చౌదరి ఢిల్లీలో కూడా లాబీయింగ్ చేసేవారు. హైకమాండ్ వద్ద మంచి పట్టు ఉండేది. అందుకే రేణుక చౌదరి తో సీనియర్ నేతలు కూడా సన్నిహితంగా మెలిగేవారు. కానీ పదేళ్ల నుంచి కాంగ్రెస్ అధికారానికి దూరంగా ఉండటంతో రేణుక చౌదరి కూడా పరపతిని కోల్పోయారు. గత పార్లమెంటు ఎన్నికల్లో ఖమ్మం నుంచి పోటీ చేసి ఓటమి పాలయిన రేణుక చౌదరి ఆ తర్వాత ఖమ్మం జిల్లా రాజకీయాలకు కూడా దూరంగా ఉంటూ వస్తున్నారు.వరసగా ఎన్నికలు జరుగుతున్నా రేణుక చౌదరి కనీసం ప్రచారానికి కూడా రాలేదు. అసలు గాంధీ భవన్ కే ఆమె రావడం మానేశారు. దుబ్బాక ఉప ఎన్నిక గాని, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను కూడా రేణుక చౌదరి పట్టించుకోలేదు. తాజాగా నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలోనూ రేణుక ఊసే లేదు. ఇక పీసీసీ చీఫ్ పదవి ఎంపికలో నూ రేణుక చౌదరి జోక్యం చేసుకోలేదు. దీంతో రేణుక చౌదరి అసలు కాంగ్రెస్ లో ఉన్నారా? లేదా? అన్న అనుమానం కలుగుతుంది. కీలక సమయాల్లో హ్యాండ్ ఇవ్వడం ఆమెకు అలవాటేనన్నది పార్టీ వర్గాల టాక్.

Related Posts