YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

మే తర్వాత ఆఫీసులు..?

మే తర్వాత ఆఫీసులు..?

హైదరాబాద్, జనవరి 4, 
రోనా ముప్పు ఇంకా ఉండటంతో ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని మరో మూడు నెలలు పొడిగించాయి. హైదరాబాద్ లోని బడా కంపెనీలు మార్చి వరకు వర్క్ ఫ్రం హోమ్ ప్రకటించాయి. గూగుల్ మాత్రం జులై దాకా ఇంటి నుంచే పనిచేయాలని చెప్పింది. చిన్న చిన్న కంపెనీలు కూడా అదే బాటలో నడుస్తున్నాయి. మొదట డిసెంబర్ వరకే వర్క్ ఫ్రం హోమ్ అనుకున్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల కారణంగా నిర్ణయాన్ని మార్చుకుంటున్నాయి.కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ కారణంగా ఐటీ కంపెనీలు గతేడాది మార్చి నుంచే ఎంప్లాయీస్ తో వర్క్ ఫ్రం హోమ్ చేయించుకుంటున్నాయి. సిటీతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన ఎంప్లాయిస్ తమ సొంతూర్లకు వెళ్లిపోయారు. మొదట కొన్ని కంపెనీలు ఆగస్ట్, సెప్టెంబర్ లో రీఓపెన్ చేయాలని నిర్ణయం తీసుకున్నా, మళ్లీ డిసెంబర్ వరకు పొడిగించాయి. జెన్ పాక్ట్, టెక్ మహీంద్రా, డెలాయిట్ వంటి బడా కంపెనీలు మార్చి వరకూ ఇంటి నుంచే పని చేయాలని చెప్పాయి. ఒరాకిల్, కాగ్నిజెంట్, ఓటీఎం ల్యాబ్స్, జెటామైన్ వంటి పలు ఎమ్మెన్సీ కంపెనీలు మొదట డిసెంబర్ వరకు వర్క్ ఫ్రం హోమ్ అని చెప్పినా, ఇప్పుడు ఫిబ్రవరి, మార్చి వరకు పొడిగించాయి.లాక్ డౌన్ నుంచి వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నాను. ఫస్ట్ మాకు డిసెంబర్ వరకు ఉండొచ్చని అన్నారు. కానీ ఇప్పుడు మార్చి వరకు కంటిన్యూ అవుతుందని చెప్పారు. అయితే ఇంకా అఫిషియల్ గా మెయిల్ రాలేదు. మళ్లీ మార్చిలో ఓపెన్ అంటే దాదాపు ఏడాది ఇంటి నుంచి పనిచేసినట్టే.నేను హైటెక్స్ లోని ఓ ఐటీ కంపెనీలో ప్రొగ్రామింగ్ టీమ్ లో వర్క్ చేస్తున్నాను. కరోనా కారణంగా ఇంటికే పరిమితం అయిపోయిన ఫీల్ వస్తోంది. గతేడాది మార్చి నుంచి వర్క్ ఫ్రం హోమే చేస్తున్నా. ఫిబ్రవరిలో కంపెనీ ఓపెన్ అవ్వొచ్చని రెండు నెలల ముందే మాకు అఫీషియల్ గా మెయిల్ చేశారు. చూడాలి ఏమవుతుందో. చూడాలి. వైరస్ వ్యాప్తి ఆగకపోవడంతో ఆఫీసులను ఇప్పుడే రీఓపెన్ చేసే ఆలోచనను చిన్న కంపె నీలు కూడా విరమించుకున్నాయి. డిసెంబర్ వరకు పరిస్థితులు మెరుగుపడతాయని అను కున్నా.. గ్యాదరింగ్, టీమ్ వర్క్ వల్ల వైరస్ స్ప్రెడ్ అవుతుందని రీఓపెన్ ను వాయిదా వేశాయి. ఈ మేరకు ఎంప్లాయీస్ కు మెయిళ్లు పంపాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ పై హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఎంటర్ ప్రెన్యూరర్స్ అసోసియేషన్ (హైసియా) సెప్టెంబర్ లో సర్వే నిర్వహించింది. ఇందులో రోజురోజుకీ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఎంప్లాయిస్ కూడా ఇంటి నుంచి పనిచేసేందుకే మొగ్గు చూపుతున్న ట్లు తేలింది. 95 శాతం కంపెనీలు తమ పూర్తి స్థాయి ఎంప్లాయీస్ తో వర్క్ ఫ్రం హోమ్ చేయించుకుంటున్నాయని సర్వేలో వెల్లడైంది.

Related Posts