రాష్ట్రంలో కొత్త రాజకీయం నడుస్తోంది. అదేదో పవన్ సినిమాలోనే చెప్పినట్టు మార్కెట్లో కొత్త దేవుడు వచ్చాడని, రాష్ట్రంలో కూడా ఇపుడు కొత్త రాజకీయం నడుస్తోంది. దీని లక్ష్యం ఏంటంటే… తాము ఎదగడానికి ప్రజా ప్రయోజనాలు అడ్డుపెట్టడం అనేది ఇపుడు ట్రెండ్. గతంలో ఒకరిని తొక్కి ఇంకొకరు పైకి వచ్చే వారు. ఇపుడు అలా కాదు… కన్నభూమికి అన్యాయం చేసయినా సరే మనం ఎదిగితే చాలని భావిస్తున్నారు. అది పక్కన పెడితే… క్యాస్టింగ్ కౌచ్ పై ఇంతకాలం మౌనంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈరోజు ఎందుకు స్పందించారు. పోనీ వాళ్లమ్మని తిట్టారు కాబట్టి స్పందించారు అనుకుందాం అంటే అది జరిగి నాలుగైదు రోజులు అయ్యింది. నిజానికి వెంటనే స్పందించాల్సిన విషయం అది. కానీ ఈరోజు మాత్రమే పవన్ కళ్యాణ్ స్పందించారు. ఇందులో రెండు రహస్యాలున్నాయి. ఒకటి రాష్ట్రంలో ప్రత్యేక హోదా క్రెడిట్ తనకు తప్ప ఎవరికీ దక్కకూడదు అన్నది. రెండోది… తనకు ఉపయోగపడని మీడియా ఎవరికీ ఉపయోగపడకూడదు అన్నది.పవన్ పై మంత్రి లోకేష్ నిఘా పెంచారా? పవన్ పై అసత్య ఆరోపణలు చేయిస్తున్నారా? జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పవన్ పై ఎలాంటి కుట్ర జరుగుతోంది? అందులో లోకేష్ ను ఎందుకు లాగుతున్నారు? పవన్ ఆరోపణల్లో నిజముందా? వంటి విషయాలు తెలియాలంటే టీడీపీ నేత లోకేష్ పెదవి విప్పాల్సిందే. లేదంటే పవన్ ఆరోపణలు ప్రజలు నిజమనుకునే అవకాశముంది శ్రీరెడ్డి వివాదం…చివరకు గాలివానలా మారి రెండు పొలిటికల్ పార్టీల మధ్య మరింత చిచ్చును రాజేశాయి. మంత్రి నారా లోకేష్ తో పాటు అతని స్నేహితుడు, ఒక ఎలక్ట్రానిక్ మీడియా యజమాని కలసి తనపై అసత్య ఆరోపణలు చేయిస్తూ కుట్ర పన్నారని, ఆరు నెలలుగా ఇదే జరగుతుందని పవన్ ఆరోపణ. అంతేకాదు ఏపీ సెక్రటేరియట్ సాక్షిగా తనపై కుట్ర జరుగుతుందన్న పవన్ ఆరోపణలు నిజంగా సంచలనమే.తెలుగుదేశం పార్టీ నేతలు ఇంతవరకూ స్పందించలేదు. ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దీక్షలో ఉండటంతో ఆయన స్పందించలేదు. పవన్ వ్యాఖ్యలపై స్పందించవద్దని టీడీపీ నేతలకు స్పష్టమైన ఆదేశాలు అందండంతో వారు మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ ఈరోజు చేసిన విమర్శలు నిజంగా రాజకీయ నేతలను కలవర పర్చేవే. తనపై ఆరోపణలు చేయడానికి పదికోట్లు సిద్ధం చేశారన్న పవన్ ఆరోపణలు నిజంగా నమ్మదగినవేనా? పవన్ వద్ద నిజంగా దీనిపై పవన్ వద్ద ఆధారాలుండే ఈ ఆరోపణలు చేశారా? అన్నది అర్థం కాకుండా ఉంది.పవన్ కల్యాణ్ ఇటీవల జరిగిన జనసేన ప్లీనరీలో సయితం లోకేష్ ను టార్గెట్ గా చేసుకున్నారు. లోకేష్ అవినీతిని బహిరంగంగా ఎండగట్టారు. ప్రతి పనికీ కమీషన్లు దండుకుంటూ లోకేష్ ఆంధ్రప్రదేశ్ ను అవినితి ఆంధ్రాగా మార్చేశారని దుయ్యబట్టారు. అప్పటి వరకూ మిత్రులగా ఉన్న టీడీపీ, జనసేన పవన్ వ్యాఖ్యలతో శత్రువులగా మారాయి. అప్పటి నుంచే తనపై నిఘా పెరిగిందన్నది పవన్ ఆరో్పణ. తన సెక్యూరిటీ ద్వారా తన కదలికలను తెలుసుకుంటున్నారని, అందుకే తనకు ప్రభుత్వం ఇచ్చిన సెక్యూరిటీని కూడా ఉపసంహరించుకుంటున్నానని ప్రకటించారు. హైదరాబాద్ లో ఒక సినీ నటి చేత పవన్ పై ఆరోపణ చేయిస్తే ఒరిగేదేమిటి? పవన్ ను తిట్టించినంత మాత్రాన ఆయన గ్రాఫ్ ఏపీ ప్రజల్లో పడిపోతుందా? పవన్ పై ఆ నటి చేసిన వివాహ సంబంధిత ఆరోపణలూ అందరికీ తెలిసినవే. పవన్ ఏదీ దాచిపెట్టలేదు. ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకున్నా చట్టబద్ధంగా, అందరికీ తెలిసే చేసుకున్నాడన్నది వారి కుటుంబం నుంచే విన్పిస్తున్న మాట.మరో వైపు ఎందుకంటే జనం ఎమోషన్లో ఉన్నపుడు వాస్తవాలు బాధపెడతాయి. అయినా కూడా వాస్తవాలు వెల్లడించడానికి ప్రయత్నించి చంద్రబాబు ఇలాగే అనేకసార్లు భంగపడ్డారు. మొన్న మరోసారి భంగపడ్డారు. రాజకీయం అంటే పార్టీల మనుగడ కోసం ప్రజా ఆస్తులకు నష్టం చేయడం కాదు. అలా చేస్తే గాల్లో పిట్టను చూసి కుండలో ఉన్న కూర పారేసినట్టు ఉంటుంది. ఎపుడో హోదా వస్తుందని, ఈరోజు మన రాష్ట్రానికి మనం నష్టం చేసుకుంటే ఈరోజు నష్టపోయి, రేపు నష్ట పోతే చివరికి రాష్ట్ర భవిష్యత్తే అంధకారంలో పడుతుంది. బాబు ఆవేదన ఇదే. కానీ బంద్ వల్ల ఆర్టీసీకి నష్టం అన్న మాటను బాగా ట్రోల్ చేశారు.